క్రైస్తవులపై దాడులను ప్రభుత్వం అరికట్టాలి తొర్రూరు డివిజన్ పాస్టర్ల ఆవేదన 

క్రైస్తవులపై దాడులను ప్రభుత్వం అరికట్టాలి తొర్రూరు డివిజన్ పాస్టర్ల ఆవేదన 

నమస్తే భరత్ తొర్రూర్ :  దేశం, రాష్ట్రములో దిన దినము క్రైస్తవ సంఘాలు,  దైవ సేవకులైన పాస్టర్లపై జరుగుతున్న దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని తొర్రూరు డివిజన్ మరియు తోరూర్ పాస్టర్లు ప్రభుత్వాలకు వినయపూర్వకముగా తెలియజేస్తున్నారు. గురువారం తోరూరు పట్టణ కేంద్రంలోని బిలీవర్స్ చర్చ్ లో ప్రార్థన ముగించుకున్న తర్వాత క్రైస్తవ పాస్టర్ లందరూ కలిసి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై సంతాపం మరియు శాంతియుత నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు రెవరెండ్ నిరీక్షణ రావు ,పాస్టర్ బి, కృష్ణమోహన్, పాస్టర్ జాన్సన్, పాస్టర్ అబ్రహం ,నెల్లికుదురు మండల పాస్టర్ రాజేందర్ ప్రసాద్ లు మాట్లాడుతూ హైదరాబాద్ కి చెందిన దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర దేశాలకు  క్రీస్తు సువార్తను మోసకపోయే దైవజనుడని అన్నారు. అంతేకాకుండా అనాధ పిల్లలకు ఆశ్రయమిచ్చి, పోషించే వాడని, దిక్కులేని వారికి ,అండ ఆదరణ లేని వారికి ప్రవీణ్ పగడాల వారికి అండగా నిలిచి వారిని కాపాడే మంచి మనసున్న దైవజనుడు ప్రవీణ్ పగడాలని అలాంటి దైవజనుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని రాజమహేంద్రవరం లో అనుమాన స్థితిలో మృతి చెంది ఉన్నాడని చెప్పిన సంఘటన మా హృదయాలను కలిసి వేసిందన్నారు. వార్తాపత్రికలలో చానల్లో ఆయన హత్య చేయబడ్డాడని చెప్తున్న సందర్భంగా ప్రవీణ్ పగడాలను హత్య చేసి ఉంటారని వారు తెలిపారు. నిజాన్నిదారణ కమిటీ వేసి దర్యాప్తు చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని వారి డిమాండ్ చేశారు.క్రైస్తవ లోకానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని వారు వేడుకున్నారు.  అది ప్రమాదము కాదని హత్య చేసి ఉంటారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే స్పందించి దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ప్రజాస్వామ్యంలో అందరం అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటున్నామని ఇలాంటి సంఘటన వల్ల క్రైస్తవులు భయాందోళనలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాంతియుత నిరసనలో తొరూరు అన్ని డినామినేషన్ పాస్టర్లు, డివిజన్లో ఉన్న అన్ని మండలాల పాస్టర్లు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ
నమస్తే భారత్ :-కేసముద్రం  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి...
అకాల వర్షాల వల్ల మామిడి, బొప్పాయి తోటల  నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి 
బిల్లు ప్రభుత్వానికి త్రిల్లు సార్ కి
పర్యవేషణ లోపం లేకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి
న్యాయ విజ్ఞాన సదస్సు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.సురేష్
ఈరోజు అత్యవసర సమయంలో రక్త  దానం చేసి మానవత్వాన్ని ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్  
రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని తీర్చాలనేదే  ముఖ్యమంత్రి తపన