నిర్మల్ పోలీస్... మీ పోలీస్....
జిల్లా వ్యాప్తంగా వారంలో ఒకరోజు కేజీబీవీ లో మహిళ పోలీసులు నిర్వహిస్తున్న "పోలీస్ అక్క" కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్.
తేదీ, 15.04.2025.
నమస్తే భరత్ : నిర్మల్ జిల్లా లోని 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుల్ లను పర్య వేక్షణ అధికారులుగా నియమించి ఒక్కో పాఠశాలలను ఒక్కో మహిళ కానిస్టేబుల్ నీ నియమించి వారంలో ఒక రోజు అట్టి స్కూల్ పిల్లలతో గడపాలని చేపట్టిన ప్రోగ్రాం మీద ఈ రోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ ఆన్లైన్ లో అందరితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ వారి వద్ద నుండి సమాచారాన్ని సేకరించి తదుపరి దిశానిర్దేశం చేశారు. స్కూల్ లో విద్యా ర్టిని లతో కలసి ఉండి మరియు రాత్రి వారితో బస చేయటం వల్ల వారికి దగ్గరవుతారు తద్వారా వారి సాధక బాధకాలు పంచుకోవచ్చు. తల్లి దండ్రులకు దూరంగా ఉంటూ ఉంటారు కాబట్టి విద్యార్థిని లకు ఎన్నో సమస్యలు ఉంటాయి , వాటిని వినటం వల్లనే సగం బారం తగ్గుతుందని తెలియజేసారు. వారిని మానసికంగా ఉత్తేజపరచాలని తదుపరి చదువుల నిమిత్తం సలహాలు ఇవ్వాలని తెలిపారు. భవిష్యత్తు లో మంచి ఉద్యోగం సంపాదించాలంటే ఎలా చదవాలి అనేది వారికి ఇప్పటి నుండే అలవాటు చేయాలన్నారు. ఉదయమే మానసిక ఉల్లాసం కోసం, శారీరకంగా ఉత్తేజం కోసం యోగా కూడా చేయించాలన్నారు. గత కొన్ని వారాలుగా ఈ ప్రోగ్రాం లో చురుగ్గా పనిచేస్తున్న వారిని ప్రశంసించారు.ఈ మీటింగ్ లో అవినాష్ కుమార్ ఐపిఎస్, రాజేష్ మీన ఐపిఎస్, ఇన్స్పెక్టర్లు అజయ్, నైలు, గోపినాథ్, మల్లేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
