డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు‌కు గౌరవ డాక్టరేట్ ఎంపిక సేవా కార్యక్రమాల పట్ల విశేష కృషికి గుర్తింపు

డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు‌కు గౌరవ డాక్టరేట్ ఎంపిక  సేవా కార్యక్రమాల పట్ల విశేష కృషికి గుర్తింపు

నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్15 : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు గౌరవ డాక్టరేట్‌కు ఎంపికయ్యారు. జర్నలిజం, సామాజిక సేవ, మానవతా దృక్పథం, యువత అభివృద్ధి రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవం లభించింది.ఈ అవార్డును ఏసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారి తరఫున, ఏసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ అందజేస్తోంది. అకాడమీ చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీ వేదికగా ఏప్రిల్ 17, 2025 (గురువారం)న ఈ గౌరవ డాక్టరేట్ అందజేయనున్నారు. వెంకన్న బాబు జర్నలిజం రంగంలో సుదీర్ఘ అనుభవంతో పాటు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, వినియోగదారుల హక్కుల సంస్థ, మానవహక్కుల సంఘం, లయన్స్ క్లబ్ వంటి అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజానికి సేవలందిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో, పేదలకు ఆరోగ్యసేవలందించడంలో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకన్న బాబు స్పందిస్తూ... ఈ గౌరవం నాకు ఆనందం కలిగిస్తోంది. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో నా వంతు కృషిని మరింతగా కొనసాగిస్తాను" అని తెలిపారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజురు చేయాలి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజురు చేయాలి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
  నమస్తే భారత్  / నారాయణపేట్ జిల్లా : అర్హత కలిగిన వారికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
కొత్తపల్లి గ్రామం  తరపున  వాల్మీకి సోదరులు  ఎంపీ డీ.కె అరుణ కు సన్మానం
భూభారతి చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం.
పౌష్టికాహారం అందించాలి పిల్లల ఎదుగుదలకు.
దగ్గడ్ ప్రేమ్ కు 19 వ జాతీయ  పురస్కారం
అంబేద్కర్ సాధించిన విజయాల్లో నేటి యువత కొన్ని అయినా సాధించాలి
బాధిత కుటుంబానికి తోడుగా నిలిచిన కాలనీ వాసులు