ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం ప్రకారమే భూబదలాయింపులు చేపట్టాలి.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
జిల్లాలో అభివృద్ధి పనుల నిర్వహణలో అటవీ భూముల వినియోగానికి సంబంధించి ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం మేరకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
తేదీ, ఏప్రిల్ 15, 2025 –
నమస్తే భరత్
నిర్మల్:-పట్టణంలో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టంపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ, అటవీ భూములపై చేపట్టే అభివృద్ధి పనులకు పరివేశ్ పోర్టల్ ద్వారా అనుమతులు పొందాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయిలోనే మంజూరు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు ఆపకుండా కొనసాగేలా చూడాలని అటవీ అధికారులకు సూచించారు. అటవీ భూముల్లో రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ప్రాజెక్టులు, పంచాయతీ భవనాలు తదితర నిర్మాణాల కోసం తప్పనిసరిగా పరివేశ్ పోర్టల్‌లో దరఖాస్తు చేయాలని తెలిపారు. ఒకవేళ ప్రతిపాదిత ప్రాజెక్టు టైగర్ రిజర్వ్ జోన్‌లో ఉంటే కేంద్ర, రాష్ట్ర వైల్డ్ లైఫ్ అధికారుల అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయడానికి అటవీ శాఖ రెవెన్యూ, విద్యుత్, ఇంజనీరింగ్ శాఖలతో సమన్వయంగా పని చేయాలన్నారు. అనంతరం పరివేశ్ పోర్టల్ గురించి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఎఫ్‌ఓ నాగినిబాను, ఆర్డీఓలు రత్నకళ్యాణి, కోమల్ రెడ్డి, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖల అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

