అందరూ కలిసి జీవించడంలోనే ఆనందం
* రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సిల్వ రాజ్
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగ ఆనందం కలిసి పంచుకోవాలని అప్పుడే సమాజంలో శాంతి సామరస్యం వెల్లివిరుస్తుందని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సిల్వ రాజ్ అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ 12వ వార్డులోని సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరంలో జమాతే ఇస్లామి హింద్ మస్జీద్ ఏ ఆది కమిటీ ఆధ్వర్యంలో జరిగిన "ఈద్ మిలాఫ్" కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ మనందరి సృష్టి కర్త అయిన దేవుడు ఒక్కడే అని ప్రతి ఒక్కరూ తమ తమ విశ్వాసాలకు అనుగుణంగా జీవిస్తూ ఇతరుల విశ్వాసంను కూడా గౌరవించాలని అన్నారు. విశ్వ హిందు పరిషత్ సినియర్ సభ్యులు కొదమ సింహం పాండురంగ చార్యులు మాట్లాడుతూ హిందూ ముస్లిం భాయి భాయి గా కలిసి మెలిసి జీవించడంలో మన కొత్తగూడెం ముందు ఉంటుందని జమాతే ఇస్లామి హింద్ ఇలా అందరినీ కలిపి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. జమాత్ జిల్లా అధ్యక్షుడు షారుఖ్ యాజ్దాని మాట్లాడుతూ రంజాన్ మాసంలో మానవాళి మార్గదర్శి ఖురాన్ అవతరించిన మాసం అని మనిషిని మంచి వాడిగా మానవతా విలువలు కలిగిన మనిషిగా జీవించేలా రంజాన్ ఉపవాసాలు శిక్షణ ఇస్తాయని అన్నారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫహీం దాదా మాట్లాడుతూ బిన్న సంస్కృతులకు నిలయం అయిన భారత దేశంలో కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు హిందూ ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నాయి అని వాటిని తిప్పి కొట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బాసిత్, సుధాకర్, నారాయణ మసీదు కమిటీ అధ్యక్షుడు జైనులాబుద్దీన్, కలీం, మస్తాన్, అఫ్జల్, మౌలానా రహ్మతుల్లా హుస్సేనీ, రబ్బానీ, ఇర్ఫాన్, సమీర్, మహిళలు పురుషులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

