బిల్లు ప్రభుత్వానికి త్రిల్లు సార్ కి
ఇరిగేషన్ ఆఫీస్ ఆ లేక ఈ వి చార్జింగ్ స్టేషన్ ఆ...?
ప్రభుత్వ కార్యాలయాలు కాస్త చార్జింగ్ స్టేషన్ లా మారిపోతున్నాయా?
ప్రభుత్వ కార్యాలయాలను చార్జింగ్ స్టేషన్ లుగా మార్చేసిన ఇరిగేషన్ అధికారులు
దర్జాగా విద్యుత్ చౌర్యం చేస్తూ దొరికిపోయిన నీటిపారుదల శాఖ అధికారి
షాద్ నగర్ పట్టణంలో ఇరిగేషన్ అధికారుల రూటే సపరేటు
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్17:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని నీటి పారుదల శాఖ కార్యాలయంను ఈవీ కారులకు చార్జింగ్ స్టేషన్ అడ్డాగా తయారు చేశారు. అధికారులు దర్జాగా కార్లలో ఇంటి నుండి బయలుదేరి వచ్చి ఎంచక్కా ఆఫీస్ కార్యాలయంలో విద్యుత్ చౌర్యం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో విద్యుత్ కార్ల వాడకం అధికమైన నేపథ్యంలో ఇంటి దగ్గర చార్జింగ్ పెడితే వందలు దాటి వేలల్లో బిల్లు తడిచి మోపడౌతుందన్న కారణంతో చూసేవారెవరు అడిగే వారెవరు అనే ధీమాతో ఎంచక్కా కార్యాలయంలోనే చార్జింగ్ స్టేషన్ గా ఏర్పాటు చేసుకున్నారు. పేదవారికి 200 యూనిట్లు దాటిందంటే చాలు దాదాపు 1500 రూపాయల తగ్గకుండా బిల్లులు వేస్తున్న విద్యుత్ శాఖ మరి ఇలా విద్యుత్తు చౌర్యం చేస్తున్న అధికార కార్యాలయాలపై ఎందుకు ఉదాసనీయంగా వ్యవహరిస్తున్నారు. దర్జాగా విద్యుత్ చౌర్యం చేస్తున్న ఇరిగేషన్ అధికారులపై విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. చార్జింగ్ స్టేషన్ అడ్డాగా మారిన నీటిపారుదల శాఖ అధికారులను ప్రశ్నించేదెవరు చర్యలు తీసుకునేది ఎవరో చూడాల్సిందే.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

