భూభారతి చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
భూభారతి చట్టంపై ప్రతి అధికారి పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
తేదీ, ఏప్రిల్ 15, 2025-
నమస్తే భరత్
నిర్మల్:-పట్టణంలో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ భూభారతి (రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్)–2025 చట్టంపై రెవెన్యూ అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ, భవిష్యత్‌లో భూ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టం తీసుకొచ్చిందని తెలిపారు. భూభారతి చట్టం ద్వారా ప్రజల భూసమస్యల పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. ఈనెల 17 వ తేదీ నుంచి అధికారులంతా గ్రామాల్లో గ్రామ సదస్సులు ఏర్పాటు చేసి గ్రామస్థులకు, రైతులకు భూభారతి చట్టంలో పొందుపరిచిన అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యల వివరాలు సేకరించాలన్నారు. భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలుపరచాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందని, నూతన చట్టం ప్రకారం భూములకు భూదార్ కార్డులు మంజూరు చేసే వెసులుబాటు కల్పించారని తెలిపారు. భూ విషయాలకు సంబంధించి చిన్న చిన్న సవరణల ప్రక్రియ అత్యంత సులువుగా, వేగంగా పూర్తవుతుందని తెలిపారు. అనంతరం చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలను కూలంకశంగా సుదీర్ఘంగా అధికారులకు కలెక్టర్ వివరించారు. ఈ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్ రెడ్డి లు, తహసీల్దార్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
