ప్రపంచ హీమో ఫీలియా దినం ర్యాలీ నీ ప్రారంభించిన డాక్టర్ వి విజయలక్ష్మి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ జె.శ్రీనివాసులుహెల్త్ ఎడ్యుకేటర్
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్17 : గురువారం ఏప్రిల్ 17 ప్రపంచ హిమోఫిలియా దినం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు యు పి హెచ్ సి షాద్ నగర్ దగ్గర డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు ఏర్పాటు చేసిన ర్యాలీని షాద్ నగర్ డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ వి. విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ ర్యాలీ యు పి హెచ్ సి ఏరియాలోని ఇందిరానగర్ కాలనీలో హిమోఫిలియాను అరికట్టాలి, రక్తహీనతను అరికట్టాలి అను నినాదాలతో ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ అనంతరము యు పి హెచ్ సి లో హీమో ఫెలియా గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ వి. విజయలక్ష్మి మాట్లాడుతూ హిమోఫిలియా అనేది వంశపారంపర్య జన్యు పరిస్థితి , ఇది రక్తం గడ్డ కట్టే సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది అని, గాయమైనప్పుడు హిమోఫిలియా లేని వారితో పోలిస్తే హీమో ఫెలియా ఉన్న వ్యక్తులు ఎక్కువగా రక్తస్రావానికి గురి అవుతారని డాక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. ప్రపంచ హేమోఫిర్యా దినోత్సవం 1989లో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హీమోపిలియా ప్రారంభించింది అని, మరియు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా స్థాపకుడు ఫ్రాంక్ స్నాప్డీల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 17న దీన్ని జరుపుకోవడానికి ఎంపిక చేయబడింది అని, ఇది 10వ శతాబ్దంలో హిమోఫిలియా కనుగొనబడింది అని , ప్రజలు తీవ్ర ఆసక్తిని కనబరిచి ప్రారంభించారు , ముఖ్యంగా మగవారిలో రక్తస్రావం కారణంగా చిన్న గాయాలు తర్వాత మరణానికి కారణం అయ్యారని , అప్పట్లో ఈ వ్యాధి అబుల్కాసిస్ అని పిలిచేవారు అని, కానీ పరిమిత సాంకేతిక పరిజ్ఞానం కారణంగా అది నయం కాలేదు అని తెలియజేశారు. ఈ వ్యాధి ముఖ్యంగా ఐరోపా రాజ్య కుటుంబాలలో సాధారణంగా మరియు ఆస్పిరిన్ చికిత్స పొందింది, ఇది రక్తము మరింత పల్చబడి , పరిస్థితి మరింత దిగజారింది. 1803లో ఫిలాడెల్ఫియా కు చెందిన డాక్టర్ జాన్ కాన్రాడ్ ఒట్టో " బ్లీడర్స్" అని పిలువబడే వ్యక్తులను అధ్యయనం చేయడం ప్రారంభించారు అని, మరియు ఇది వారి తల్లుల ద్వారా మగవారికి సంక్రమించే వంశపారంపర్య అనారోగ్యమని చెప్పారు అని, 1937లో హీమోపిలియా జన్యుపరమైన రుగ్మత రెండు రకాలుగా విభజించబడింది ఎ అండ్ బి అని, కానీ అప్పటివరకు సరైన చికిత్స కనపడలేదు. అప్పుడు డబ్ల్యూ ఎఫ్ హెచ్ పుట్టినరోజు ల వ్యవస్థాపకుడు సందర్భంగా హేమో-ఫీలియా వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏప్రిల్ 17 ను ఎంచుకున్నారు అని విజయలక్ష్మి తెలియజేశారు. హీమో పీలియా వ్యాధితో బాధపడుతున్న రోగులకు రక్తంలో ప్రోటీన్ ఉండదు అని, దీనిని గడ్డకట్టే కారకం అని కూడా అంటారు అని చెప్పారు. ఈ ప్రోటీన్ ప్లేట్ లెట్స్ తో కలిసి గాయపడిన ప్రదేశంలో రక్తస్రావం అవ్వడానికి పనిచేస్తుందని, అంటే గాయం తరువాత ఒక వ్యక్తికి ఎక్కువ కాలం రక్తస్రావం అవుతుంది అని మరియు వారు అంతర్గత రక్తస్రావానికి ఎక్కువ అవకాశం ఉంటుందని, రక్తస్రావం ఎక్కువగా ఉంటే అది ప్రాణాంతకం కావచ్చు అని డాక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. చికిత్స హిమోఫిలియా కు ప్రధాన చికిత్స రీప్లేస్మెంట్ తెరఫీ అని, గడ్డకట్టే కారకము (హీమో ఫెలియా ఎ కోసం) లేదా క్లాటింగ్ ఫ్యాక్టర్ (హేమోఫిలియా బి కోసం) ఒక్క గాడతలు నెమ్మదిగా డ్రిప్ చేయబడుతాయి అని లేదా సిరలో కి ఇంజెక్ట్ చేయబడతాయి అని, ఈ కషాయాలు తప్పిపోయిన లేదా తక్కువగా ఉన్న గడ్డకట్టే కారకాన్ని భర్తీ చేయడంలో సహాయపడతాయని చెప్పారు. ఈ సంవత్సరము ఈ వ్యాధి యొక్క థీమ్.అందరికీ సమానమైన యాక్సెస్, అన్ని రక్తస్రావం రుగ్మతలను గుర్తించడం అని డాక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ స్రవంతి, ఎమ్. ఎల్ . హెచ్.పి. వైద్యాధికారులు డాక్టర్ జగదీష్ , డాక్టర్ సంధ్య, హెల్త్ ఎడ్యుకేటెర్ జె. శ్రీనివాసులు, డిపిఎమ్ఓ వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్లు చంద్రకళ, శ్రీరామ, అమృత, ల్యాబ్ టెక్నీషియన్ శివ, గౌస్, చించోడు మరియు పి.పి యూనిట్ ఏఎన్ఎంలు మరియు ఆశలు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

