వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ శిక్తా పట్నాయక్
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 16) : మద్దూరు మండల కేంద్రంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు.ధాన్యం కొనుగోలు కేంద్రంలో సౌకర్యాలు పరిశీలించారు. కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి ఇంత వరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారని నిర్వాహకులను ఆమె అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమను కొలిచే యంత్రంతో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు.నిర్ణీత తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కొనుగోలు చేయాలని ఆమె ఆదేశించారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని టాగ్ చేసిన మిల్లుకు రవాణా చేయాలన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రంకు వచ్చిన ధాన్యం తేమ శాతం పరిశీలించి రైతులకు వ్యవసాయ అధికారులు టోకెన్లు జారీ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంకు తూర్పార పట్టి, ఆర పోసి,తాలు,మట్టి లేని నాణ్యత ప్రమణాల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.అకాల వర్షాలు కురుస్తున్నoదున రైతులు ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం లో ధాన్యం శుభ్రం చేయుటకు ప్యాడీ క్లీనర్, టార్పాలిన్ లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పల్లెగడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని కూడా తనిఖీ చేసి అక్కడి నిర్వాహకులకు వరి కొనుగోలుకు సంబంధించి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలొమ్, తహాసిల్దార్ మహేష్ గౌడ్, రెవెన్యూ, సింగిల్ విండో అధికారులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

