చలించిన హృదయం. అందించెను దాతృత్వం

చలించిన హృదయం. అందించెను దాతృత్వం

- మానవత్వం చాటుకున్న మరిపెడ ఎస్సై సతీష్
- రోడ్డు ప్రమాదంలో ఇంటికే పరిమితమైన వ్యక్తికి రూ. 5వేల ఆర్థిక చేయూత 
- కుటుంబ పెద్ద ఇంటికే పరిమితమవటంతో ఆర్థికంగా నలిగిన కుటుంబం.
- ఆపన్న హస్తాల కోసం ఎదురు చూపు..

 నమస్తే భారత్ :-మరిపెడ రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం.. రోజు కూలికి వెళ్తే గాని గడవని ఇల్లు.. వారిద్దరూ వారికి ఇద్దరు పిల్లలు.. ఇంతలో పెద్ద విషాదం.. పనికి వెళ్తూ ఇంటి పెద్ద రోడ్డు ప్రమాదానికి గురై మంచానికే పరిమితమయ్యారు. కుటుంబం అంతా ఆధారపడిన వ్యక్తి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఇల్లు గడవలేని దీనస్థితి వారిది.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బోట్య తండా కు చెందిన ధరంసోత్ నవీన్ వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పనికి వెళ్లి వస్తు రోడ్డు ప్రమాదానికి గురై అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా మతిస్థిమితం సరిగా లేక బయటికి వెళ్లి పని చేయలేని పరిస్థితి. ఇంటి వద్ద ఉండటంతో నవీన్ భార్య కూడా భర్త వద్దకు చూసుకోవాలిగా పరిస్థితి. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా నలిగిపోతుంది.  ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా ఇంటికి వెళ్లిన మరిపెడ ఎస్సై బొలగాని సతీష్ కుమార్ నరేష్ దీనస్థితిని చూసి చలించి పోయారు. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం అని తెలపడంతో తన వంతు సహాయంగా రూ.5000 నరేష్ కుటుంబానికి అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దాతలు ఎవరైనా ఉంటే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, నవీన్ కోలుకునే వరకు చేయూత అందించాల్సిందిగా తండావాసులు కోరుతున్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి
* నూతన భవనాల నిర్వహణను అధికారులు పర్యవేక్షించాలి* కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని* రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
సార భద్రమ్మ పార్దివ దేహాన్ని  పూలమాలవేసి నివాళులర్పించిన  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్
సమాజా నిర్మానంలో జర్నలిస్టుల పాత్ర కీలకం 
నందిగామ మండలం ఎంపీడీవో కార్యాలయ భవనం స్లాబ్ నిర్మాణ పనుల ప్రారంభం
ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్‌లో ఉత్తమ స్థానంలో నిలిచిన పెంబి బ్లాక్. 
ఎంకన్నగూడ తాండా సేవాలాల్ గుడికి బీజేపీ నేత అందే బాబన్న రూ.25,000 విరాళం
జనసేవలో అంకితభావానికి గౌరవం... డాక్టర్ వెంకన్న బాబుకు విశిష్ట పురస్కారం