పోషణ్ పక్షం పోషకాహారం సదస్సు
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్16 : బుధవారం రంగారెడ్డి జిల్లా దూస్ కల్ గ్రామపంచాయితీ హెల్త్ సబ్ సెంటర్ నందు పోషణ్ అభియాన్ లో (08.04.2025 నుండి 22.04.2025) లో భాగంగా పోషణ్ పక్షం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా పోషకాహారం , ఉబకాయం, పోషకాహార లోపం వల్ల కలిగే నష్టాల గురించి వివరంగా తెలియపర్చారు. 1000 రోజులు (ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ నుండి పసిబిడ్డ వయస్సు 2 ఏళ్ళు అయ్యేదాకా) పోషకాహారం గర్భిణీలు, బాలింతలు & పసిపిల్లలు తప్పక తీసుకోవడం గురించి మరియు అంగన్వాడీ టీచర్లు నిర్వహించే పోషణ్ ట్రాకర్ యాప్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గర్భిణీలకు, బాలింతలకు మరియు పసిపిల్లలకు అందించే పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వారికి మెరుగైన పోషణ అందించే మార్గాల గురించి వివరించారు.
ఇట్టి కార్యక్రమంలో సూపర్ వైజర్ జయలక్ష్మి, సబ్ సెంటర్ డాక్టర్ శ్వేత,ఏ ఎన్ ఎమ్ గౌసియా, అంగన్వాడీ టీచర్లు పద్మ, అమృత, ఆశాలు యాదమ్మ, జ్యోతి, ఆయాలు పార్వతమ్మ, సుజాతలు మరియు గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

