వెల్ఫేర్ పనులు పెండింగ్లో పెట్టొద్దు 

 జనరల్ మేనేజర్ పర్సనల్ కవితా నాయుడు 

వెల్ఫేర్ పనులు పెండింగ్లో పెట్టొద్దు 

నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: కంపెనీకి కార్మికులకు సంబంధించిన ఎలాంటి పనులను పెండింగ్లో పెట్టకుండా పూర్తయ్యే విధంగా చూడాలని జనరల్ మేనేజర్(పర్సనల్) ఐ‌ఆర్, పి‌ఎం అండ్ వెల్ఫేర్ కవితా నాయుడు సూచించారు. సింగరేణి సంస్థ సిఎం‌డి ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలోని పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులతో నిర్వహించబోయే సమీక్షా సమావేశంలో భాగంగా కొత్తగూడెం రీజియన్ లోని  కార్పొరేట్ కొత్తగూడెం మణుగూరు ఇల్లందు ఏరియాల పర్సనల్  డిపార్ట్మెంట్  అధికారులతో  గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయ హెచ్‌ఆర్‌డి కాన్ఫరెన్స్ హాల్ నందు  జి‌ఎం(పర్సనల్) ఐ‌ఆర్ పి‌ఎం వెల్ఫేర్ కవితా నాయుడు సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కొత్తగూడెం మణుగూరు ఇల్లందు కార్పొరేట్  ఏరియాల వారిగా విధులకు గైర్హాజరు అవుతున్న ఉద్యోగులకు తీసుకునే క్రమశిక్షణాచర్యలపై కాంట్రాక్టు కార్మికుల సమస్యలు కోర్టు కేసులు ఉద్యోగుల పదోన్నతులు కారుణ్య నియామకాలు పదవీ విరమణ పొందే ఉద్యోగుల సి‌ఎం‌పి‌ఎఫ్, పెన్షన్ క్లెయిమ్, గ్రాట్యుటీ, సి‌పి‌ఆర్‌ఎం‌ఎస్ మెడికల్ కార్డులు ఏరియాల వారీగా గల క్వార్టర్స్ వివరాల వంటి అంశాలపై సమీక్షించారు. విధులకు గైర్హాజరు అయ్యే ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులతో కలసి కౌన్సెల్లింగ్ నిర్వహించాలని తద్వారా ఉద్యోగి రోజువారిగా విధులకు హాజరయ్యేలా చూడాలని అలాగే వెల్ఫేర్ కి సంబంధించి ఎటువంటి పైల్స్ పెండింగ్ లో ఉంచకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జి‌ఎం(పర్సనల్) ఐ‌ఆర్, పి‌ఎం అండ్ వెల్ఫేర్ కవితా నాయుడుతో పాటు ఏ‌జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ జి.రాజేంద్ర ప్రసాద్, డి‌జి‌ఎం(పర్సనల్) ఐ‌ఆర్ వింగ్ కే.అజయ్ కుమార్, డి‌జి‌ఎం(పర్సనల్)లు ఎస్.రమేశ్, ఎస్.వరప్రసాద్, ఎస్.వేంకటేశ్వరరావు, జి.వి.మోహన్ రావు, వై‌వి‌ఎల్ వరప్రసాద్, బి.రాజగోపాల్ ముకుంద సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ సి‌వి‌వి‌ఎస్ మూర్తి, ఎల్.తిరుపతి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్  అధికారులు  పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి
* నూతన భవనాల నిర్వహణను అధికారులు పర్యవేక్షించాలి* కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని* రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
సార భద్రమ్మ పార్దివ దేహాన్ని  పూలమాలవేసి నివాళులర్పించిన  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్
సమాజా నిర్మానంలో జర్నలిస్టుల పాత్ర కీలకం 
నందిగామ మండలం ఎంపీడీవో కార్యాలయ భవనం స్లాబ్ నిర్మాణ పనుల ప్రారంభం
ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్‌లో ఉత్తమ స్థానంలో నిలిచిన పెంబి బ్లాక్. 
ఎంకన్నగూడ తాండా సేవాలాల్ గుడికి బీజేపీ నేత అందే బాబన్న రూ.25,000 విరాళం
జనసేవలో అంకితభావానికి గౌరవం... డాక్టర్ వెంకన్న బాబుకు విశిష్ట పురస్కారం