ఈ నెల 27 న ఎల్కతుర్తి లో గులాబీ జాతరకు ప్రజలు,కార్యకర్తలు తరలిరావాలి 

ఈ నెల 27 న ఎల్కతుర్తి లో గులాబీ జాతరకు ప్రజలు,కార్యకర్తలు తరలిరావాలి 


నమస్తే భారత్ :-హనుమకొండ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈనెల 27 న నిర్వహించనున్న గులాబీ పార్టీ పాతికేళ్ళ భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మాజీ మంత్రి, సత్యవతి రాథోడ్  అన్నారు బుధవారం ఎల్కతుర్తి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్  విలేకరులతో మాట్లాడారు బిఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు,బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు తరలిరానున్నట్లు సత్యవతి రాథోడ్  తెలిపారు.  ఈ సందర్బంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు సత్యవతి రాథోడ్  మాట్లాడుతూ భారీ బహిరంగ సభ దిగ్విజయం కావడం ఖాయం అని అన్నారు తెలంగాణ రాష్ట్రం తెస్తామని చెప్పి.తెచ్చి చూపించి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామీగా నిలిపిన ఘనత తమ అధినేత కెసిఆర్ కి దక్కుతుందని సత్యవతి రాథోడ్  వివరించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు  నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని సత్యవతి రాథోడ్  విమర్శించారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలు అయిందని అన్నారు ప్రజా క్షేత్రంలో గెలుపు ఓటములు సహజం అని, ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి, సత్యవతి రాథోడ్  పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మాజీ ఎమ్మెల్యే లు నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,గ్యాదరి బాలమల్లు, నాగుర్ల వెంకటేశ్వర్లు, తదితరులు

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి
* నూతన భవనాల నిర్వహణను అధికారులు పర్యవేక్షించాలి* కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని* రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
సార భద్రమ్మ పార్దివ దేహాన్ని  పూలమాలవేసి నివాళులర్పించిన  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్
సమాజా నిర్మానంలో జర్నలిస్టుల పాత్ర కీలకం 
నందిగామ మండలం ఎంపీడీవో కార్యాలయ భవనం స్లాబ్ నిర్మాణ పనుల ప్రారంభం
ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్‌లో ఉత్తమ స్థానంలో నిలిచిన పెంబి బ్లాక్. 
ఎంకన్నగూడ తాండా సేవాలాల్ గుడికి బీజేపీ నేత అందే బాబన్న రూ.25,000 విరాళం
జనసేవలో అంకితభావానికి గౌరవం... డాక్టర్ వెంకన్న బాబుకు విశిష్ట పురస్కారం