క్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన మమత హాస్పిటల్
మహిళ కడుపులో నుండి 6.5 కేజీల గడ్డను తీసిన వైద్యులు , మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డాక్టర్లు
నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ : బచూపల్లిలోని మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ వైద్యులు క్లిష్టమైన అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఈ సందర్భంగా మమత హాస్పిటల్ వైద్యులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.. వివరాలు ఇలాఉన్నాయి..మెదక్ జిల్లాకు చెందిన ఎల్లమ్మ (50)కు దాదాపు 10 సంత్సరాల క్రిందట ఓ ఆసుపత్రిలో గుండె సమస్య ఆపరేషన్ జరిగింది. ఈ మధ్యకాలంలో మల్లి ఆమెకు శ్వాస ఇబ్బంది మొదలైంది, ఈవిషయమై వివిధ ముల్టి స్పెషాలిటీ హాస్పిటల్స్ కు వైద్యం కోసం వెళ్లింది. అయితే ఎల్లమ్మకు వైద్యులు టెస్టులు చేశారు అందులో ఆమె కడుపులో వింతదేదో ఉందని, అది కాన్సర్, ట్యూమర్, నీటి బుడగ కావచ్చని ఇదివరకు గుండె సమస్య ఉనందున సర్జరీ సమయంలో ఏదైనా జరగచ్చని ఇది హై రిస్క్ కాబట్టి వైద్యం చెయ్యడం కష్టమని చేతులు ఎత్తేశారు. అనంతరం ఎల్లమ్మ బచూపల్లిలోని మమత మెడికల్ సైన్స్ ఆసుపత్రి వైద్యురాలు మైత్రిని కలిసి తన సమస్యను వివరించారని తెలిపారు. దింతో డాక్టర్ మైత్రితో పాటు వారి డాక్టర్ల టీం శైలజ, ఆమని, ఉషా నాగ్ ఎల్లమ్మకు ఎబ్డోమినల్ హై స్టెరాటమి, బిలాటరీల్ సెల్ఫీన్గో ఓపిహెరాటమి శస్త్ర చికిత్స చేసి కడుపులో ఉన్న దాదాపు 6.5 కేజీల గడ్డను తీసేసారు. ఈశస్త్ర చికిత్సలో ఎనేస్తేసియా డాక్టర్లు రాజశేఖర్, శివప్రసాద్, భువన్. కార్డియాలజీ విభాగం నుండి డాక్టర్ సాంబశివరావు వారి బృందం సహాయపడ్డారని ఇప్పుడు పేషెంట్ పరిస్థితి బాగుందని ఆవిడ ఆక్టివ్ గా ఉందని స్పష్టం చేశారు. అడ్మిన్ డిపార్ట్మెంట్ డాక్టర్లు నవీశ్వర్, ధీరజ్, అనిరుద్, ప్రణీత్ మాట్లాడుతూ., తమ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన వైద్యం అందించడం కోసం మమత హాస్పిటల్ ప్రజలందరికీ ఉపయోగపడేలా సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. మమత హాస్పిటల్ లో సిబ్బంది బాగా చూసుకొని తన ప్రాణాలు రక్షించారని తాను ఆసుపత్రికి ప్రత్యేకంగా డాక్టర్ మైత్రికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎల్లమ్మ తెలిపింది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
