జనసేవలో అంకితభావానికి గౌరవం... డాక్టర్ వెంకన్న బాబుకు విశిష్ట పురస్కారం
ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబుకు గౌరవ డాక్టరేట్ అవార్డు
ఏసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందజేత.
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్18:రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ప్రముఖ సామాజికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ కొమ్ము వెంకన్న బాబుకు గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ తరఫున ఆయనకు ఈ గౌరవం కలిగింది. భాగ్యనగరంలోని నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోనీ ఎన్టీఆర్ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఏషియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ,స్పూర్తి అకాడమీ చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా డాక్టర్ కొమ్ము వెంకన్న బాబుకు గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. లైన్స్ క్లబ్, నేషనల్ హ్యూమన్ రైట్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కన్స్యూమర్ ఫోరం ద్వారా సామాజిక సేవ, వైద్య సేవలు, జర్నలిజం, యువత అభివృద్ధి వంటి విభాగాల్లో డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందించామని నిర్వాహకులు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలోను పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వెంకన్న బాబు సేవలు ప్రశంసనీయం అని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆకుల రమేష్ మాట్లాడుతూ...డాక్టర్ వెంకన్న బాబు సేవా దృక్పథం, ప్రజల పట్ల నిబద్ధత, విలువలతో కూడిన జీవనశైలి ఆయనను ఈ గౌరవానికి అర్హుడిగా చేశాయని పేర్కొన్నారు.డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు స్పందిస్తూ....ఇన్నేళ్లుగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేస్తున్న సేవలకు గౌరవ డాక్టరేట్ రూపంలో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది అని,ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలో సామాజిక బాధ్యతను పంచుకుంటూ పని చేస్తే సమాజ అభివృద్ధికి తోడ్పడవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన యూనివర్సిటీకి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

