భూభారతి చట్టంతో భూసమస్యల పరిష్కారం.

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

భూభారతి చట్టంతో భూసమస్యల పరిష్కారం.

భూభారతి చట్టం అమలుతో ప్రజల భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

తేదీ, ఏప్రిల్ 18,  2025 
నమస్తే భరత్  నిర్మల్ జిల్లా // మామడ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి, నూతన ఆర్ ఓ ఆర్ చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సు ఆమె పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్  మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి చట్టం ద్వారా ప్రజల భూసంబంధిత సమస్యలు ఇక భవిష్యత్తులో తలెత్తకుండా ఉంటాయని పేర్కొన్నారు. భూమి రిజిస్ట్రేషన్ అనంతరం లబ్ధిదారుడి పట్టా పాస్ బుక్‌లో భూ మ్యాపింగ్ నమోదవుతుందని తెలిపారు. భూకమతాలకు భూధార్ కార్డులు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. సీనియర్ ఉన్నత అధికారులు, భూ చట్టాల, న్యాయ నిపుణులు ఎంతో కాలం కసరత్తు చేసిన తర్వాత భూభారతి చట్టం రూపు దాల్చిందని తెలిపారు. సదస్సులో రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టంలోని ముఖ్యాంశాలపై వివరాలు తెలియజేసారు. మండలానికి చెందిన రైతుల నుండి భూసంబంధిత ఫిర్యాదులు స్వీకరించి వాటిపై సమీక్ష నిర్వహించారు. కొత్త చట్టంతో తమ సమస్యలు తొలగిపోతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.  అంతకుముందు భూభారతి చట్టంపై అవగాహన కలిగేలా జిల్లా సమాచార పౌర సంబంధాలు, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సారధి కళాకారులు పాటల రూపంలో కళాజాత ప్రదర్శనలు  నిర్వహించారు. తదనంతరం తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. సమయపాలన పాటించి, ప్రజల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాల జాబితాను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రికార్డు గదిని తనిఖీ చేసి అన్ని రకాల రిజిస్టర్లు సమగ్రంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ అవగాహనా సదస్సులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సుశీల్ రెడ్డి, వ్యవసాయ అధికారి సంధ్యారాణి, రైతులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News