సమాజా నిర్మానంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
- వార్తలతో పాటుగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
- సీనియర్ జర్నలిస్టు లచ్చన్నను పరామర్శించిన ఎమ్మెల్యే రామచంద్రనాయక్
నమస్తే భారత్ :-మరిపెడ : సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రభుత్వాలకు ప్రజలకు వారదులుగా ఉన్న జర్నలిస్టులు వార్తా సేకరణలతో పాటుగా ఆరోగ్యం పై కూడా శ్రద్ధ వహించాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్రు నాయక్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీనియర్ జర్నలిస్టు జిన్నా లచ్చయ్యను శుక్రవారం ఎమ్మెల్యే పరామర్శించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకుని విచార వ్యక్తం చేశారు. స్వతహాగా వైద్యుడు కావడంతో రిపోర్ట్స్ చూసి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. జర్నలిస్టులు సమాచార సేకరణతో పాటుగా విధిగా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని, లచ్చయ్య త్వరగా కోలుకొని తిరిగి ప్రజలకు వారి వార్త సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం ఖర్చుల నిమిత్తం రూ. 5వేలు లచ్చయ్యకు అందించారు. ఆయన వెంట మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొంపెల్లి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, మైనార్టీ నాయకులు షేక్ అఫ్జల్, మండల నాయకులు గండి రమేష్, మరిపెడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మొహమ్మద్ రియాజ్ పాషా, ప్రధాన కార్యదర్శి రాంపల్లి వీరాంజి, ప్రెస్ క్లబ్ సభ్యుడు బోడపట్ల వెంకన్న, కాంగ్రెస్ యువ నాయకులు శ్రీను, జాటోతు సురేష్, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

