భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి భూభారతి చట్టం దోహదం

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి భూభారతి చట్టం దోహదం

భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్ చట్టంపై అవగాహన కల్పించేందుకు

నమస్తే భారత్ నిర్మల్ :  గ్రామీణ మండలం న్యూ పోచం  పాడ్ రైతు వేదికలో నిర్వహించిన అవగాహనా సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్. మాట్లాడుతూ, రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేలా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని వివరించారు. భూమి హక్కుల భద్రత, భూ సమస్యల వేగవంతమైన పరిష్కారానికి ఇది దోహదపడుతుందన్నారు. రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. భూ వివాదాల విషయంలో అప్పీల్‌ ప్రక్రియ ఉచిత న్యాయసహాయంతోపాటు, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిల్లోనూ అప్పీల్స్ చేసే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. భూధార్ కార్డుల రూపంలో రైతులకు భూముల వివరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో లేని సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు. రికార్డులలో తప్పుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, వారసత్వ భూముల లాంఛనీకరణ, సాదా బైనామాల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సదస్సులో రైతులకు వివరించారు. అంతకుముందు భూభారతి చట్టంపై అవగాహన కలిగేలా జిల్లా సమాచార పౌర సంబంధాలు, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సారధి కళాకారులు పాటల రూపంలో కళాజాత ప్రదర్శనలు నిర్వహించారు.ఈ అవగాహనా సదస్సులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, తహసిల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానంద్, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News