ప్రజలకి ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్దుల జంగయ్య విమర్శ
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్18 : సిపిఐ మండల కార్యదర్శి జిల్లెల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో
జిల్లేడు చౌదరిగుడా మండల పరిధిలోని వనంపల్లి చౌదర్ గూడా గ్రామాలలో గ్రామ శాఖ సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుద్ధుల జంగయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చాయని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పెట్టుబడిదారులకు ఎర్ర తివాచి పరిసిఅంబానీ ఆదానిలకు ఉడియం చేస్తుందని ఆయన విమర్శించారు అట్టడుగు పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కటి కూడా అందడం లేదని ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో గ్రామాలలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉందని దానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలేనని మూల్య నక్కపై తాటికాయ పడ్డట్టు గ్యాస్ బండమీద 50 రూపాయలు పెంచి పేదల ఉసురు పోసుకుంటుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఆయన విమర్శ చేశారు ఎన్ఆర్ఈజీఎస్ పథకానికి నిధుల కోత విధించి గ్రామంలో పేదలు పనులు చేస్తున్న నేటికీ బేసిక్ షిప్ లు కూలిడబ్బులు లేవు కూలీలు పనులు చేస్తున్న దగ్గర వసతులు లేవు అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం మాత్రం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఉకే దంప్పుడు ఉపన్యాసాలు ప్రచారాలు చేస్తున్నారు నిజంగా ఎక్కడ అభివృద్ధి చెందిందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు చదువుకున్న యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు లేవు నిరుద్యోగం పెరిగిపోయి గ్రామాలలో యువత పెడదారులు పడుతున్న పరిస్థితి ఉంది దాని మీద కేంద్ర ప్రభుత్వానికి సో యున్నదా అని ఆయన మండిపడ్డారు నిజంగా అభివృద్ధి చేయాలంటే ప్రతి పేదవారికి పనిని కల్పించడం కడుపునిండా తిండి పెట్టడం గూడు నీడ ఇవన్నీ ఇవ్వడం అది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆ సోయే లేదు అని ఇకనైనా పేదల సమస్యలు పట్టించుకోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలని ఏ ఒక్క గ్యారంటీ సక్రమంగా అమలుపరచకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు రైతు రుణమాఫీ సక్రమంగా అమలు చేయలేకపోయారు ఉపాధి హామీ కూలీలకు ఇచ్చిన హామీ సంవత్సరానికి 12000 కొంతమంది కొచ్చి చాలామందికి అమలే కాలేదు యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని నేటికి దాని ఊసే లేదు వృద్ధాప్య పెన్షన్లు 2000 నుంచి 4000 పెంచుతామని వికలాంగుల పింఛన్లు 4000 నుంచి 6000కు పెంచుతామని హమి ఇచ్చి నేటికీ అమలుపరచకపోవడమనేది ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనం అని ఆయన మండిపడ్డారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను మొత్తం నెరవేర్చి కొత్త హామీలు ఇవ్వాలని కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భవిష్యత్తులో తీసుకోబో ప్రజా పోరాటాలకు ప్రజలందరూ సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లేడు చౌదరిగుడా మండల కార్యదర్శి జిల్లెల్ల వెంకటేష్ బి కే ఎం యు జిల్లా కోశాధికారి ఎం కృష్ణ చౌదర్ గూడా గ్రామ కార్యదర్శిగా నూతనంగా ఎండి షబ్బీర్ సహాయ కార్యదర్శిగా
కే చిన్నయ్య.వనంపల్లి గ్రామ శాఖ కార్యదర్శిగా కావలి నర్సమ్మ సహాయ కార్యదర్శిగా కర్రొల్ల యాదమ్మ ను ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి ఎం వీరేశం జీ పాపయ్య ఎస్ పాపయ్య జంగమ్మ అనంత రాములమ్మ చంద్రయ్య కిష్టయ్య లక్ష్మమ్మ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
