భూభారతి చట్టం 2025 అవగాహన - పినపాకలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జితేష్ వి పాటిల్
ప్రజలకు ఉపయోగకరం భూభారతి స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
నమస్తే భారత్: పినపాక : పినపాక మండలం జివిఆర్ ఫంక్షన్ హాల్ లో భూపాలపట్నం గ్రామంలో శుక్రవారం జరిగిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని భూభారతి చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు, భూభారతి హక్కుల రికార్డుల తప్పులు సవరణకు అవకాశం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే యాప్ తయారీ సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారం వారసత్వంగా వచ్చిన భూములకు న్యూట్రిషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేసి భూమి హక్కులు ఏ విధంగా సక్రమించిన మ్యుటేషన్ చేసే ముందు రికార్డులు నమోదు చేయడం, పాస్ పుస్తకాలలో భూమి పటం, భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచల ఆపిల్స్, వ్యవస్థ భూధార్ కార్డుల జారీ ఇంటి స్థలాలకు ఆభాధి, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం రికార్డుల నిర్వహణ, మోస పూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వం భూదాన్, అసైన్డ్ ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందుతే రద్దుచేసే అధికారం, హక్కుల రికార్డులు తప్పుల సవరణ భూమి హక్కులు ఉండి రికార్డులు లేని వారు హక్కుల రికార్డులు నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలోగ దరఖాస్తు చేసుకోవచ్చని, రెవిన్యూ డివిజనల్ అధికారి, జిల్లా కలెక్టర్లు ఈ దరఖాస్తులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి ద్వారా ప్రజలందరికీ తగు న్యాయం చేకూర్తుందని, భూముల దరఖాస్తులు అనంతరం స్థానిక తహసిల్దార్ ఆధ్వర్యంలోనే 90% న్యాయం చేకూరుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... భూభారతి ద్వారా స్థానికంగానే ప్రజలందరికీ తమ భూములు భూభారతిలో ఎక్కించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. స్థానికంగా మునగ చెట్లను సాగు చేస్తున్న కొప్పుల వర్మాను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తాసిల్దార్ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. 30 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి దామోదర్ రావు, మండల స్పెషల్ ఆఫీసర్ తాతారావు, తాసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీవో సునీల్ కుమార్, ఏవో వెంకటేశ్వరరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, సర్వేర్ నరేష్, సీనియర్ జర్నలిస్ట్ నరసింహమూర్తి, రమణ, గంగాధర్, వివిధ శాఖల అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
