ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదు.
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్18:నేను అనగా పి.ఆకాష్ నాయక్,తండ్రి శంకర్,ఏ ఐ ఎస్ ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శిగా విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాను వి.శ్రీకాంత్ తండ్రి అంజయ్య ఎస్ ఎఫ్ ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాను
వారు మాట్లాడుతూ జిల్లేడు చౌదర్ గూడ మండల పరిధిలోని పెద్ద ఎల్కిచేర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత స్థాయి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎమ్. వెంకట్ రెడ్డి గణిత శాస్త్ర ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు అయితే ఆయన పుట్టిన తేదీ ప్రకారం ఆయన రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం 2024 ఏప్రిల్ మాసంలో ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది కానీ అలా కాకుండా గెజిటెడ్ హెడ్ మాష్టర్ ప్రమోషన్ కోసం తన డేట్ అఫ్ బర్త్ తన ఒరిజినల్ డేటాఫ్ బర్త్ 05/04/1963 పదవ తరగతి స్కూల్ బోనోఫైడ్ ఉండగా ప్రమోషన్ కోసం 05/04/1965గా ఉద్యోగ సర్వీస్ పుస్తకంలో మరియు ఆన్ లైన్ లో మార్చుకొని గత 12 నెలలుగా ప్రభుత్వాన్ని మరియు విద్యాశాఖ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ పెద్దఎల్కిచేర్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ సుమారు 15 లక్షల రూపాయల వరకు జీతాన్ని తీసుకున్నాడు అంతేకాకుండా 2013 వ సంవత్సరంలో ఆయన ప్రమోషన్ కోసం హైదరాబాదులోని కోటి ఆసుపత్రిలో ఫేక్ వికలాంగుడి సర్టిఫికెట్ తీసుకొని వికలాంగుల కోట కిందనే ప్రమోషన్ తీసుకున్నారని రీజినల్ జాయింట్ డైరెక్టర్ విచారణ జరిపి గతంలోనే మహబూబ్ నగర్ జిల్లా డీఈఓకి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది కాబట్టి ఆయన పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వాన్ని విద్యాశాఖ అధికారులను తప్పుదోవ పట్టించి పేద విద్యార్థులకు అన్యాయం చేసిన అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
