మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి
* నూతన భవనాల నిర్వహణను అధికారులు పర్యవేక్షించాలి
* కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని
* రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు వసతుల ఏర్పాటుకు నిరంతరం కృషి చేస్తున్నానని ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రతిపైసా దుర్వినియోగం కాకుండా నిత్యం పర్యవేక్షింస్తూ ప్రజలకోసం వెచ్చిస్తున్నామని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగులో రూ.16లక్షల నిధులతో నిర్మించిన సబ్ సెంటర్ భవనానికి చుంచుపల్లి మండలంలోని రామాంజనేయ కాలనీలో రూ.20లక్షల వ్యయంతో వెంకటేశ్వర కాలనీలో రూ.20లక్షల వ్యయంతో విద్యానగర్ కాలనీలో రూ.16లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను శుక్రవారం కూనంనేని ప్రారంభించి ప్రజా సేవకు అంకితం చేశారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి చుంచుపల్లి మండలాల పరిధిలో ఐటిడిఏ నిధులతో నాలుగు భవనాల నిర్మాణం పూర్తి చేసుకున్నాయని తెలిపారు. ఇప్పటికి నియోజకవర్గ పరిధిలో వివిధ పథకాల్లో మంజూరైన నిధులతో రోడ్లు డ్రైన్లు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేశామన్నారు. ప్రజలకు నిత్యావసరాలైన త్రాగునీరు విద్యుత్ సౌకర్యాలపై ప్రేత్యేక ద్రుష్టి సారించామన్నారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తుసుకున్నామన్నారు. ఎమ్మెల్యే నిధులతో నియోజకవర్గంలో 14 సంఘాల భవనాలు 7 బస్సు సెల్టర్లు విద్యుత్ స్తంబాలు ప్రభుత్వ భవనాలు విద్యాలయాల అభివృద్ధి రహదార్లు డ్రైన్లు నిర్మించనున్నామని వీటికోసం రూ.10కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశామని త్వరలో వీటికి మంజూరు లభిస్తుందని తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని సమస్యలు లేని నియోజకవర్గాన్ని నిర్మించడమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్నాని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా వైద్యాధికారి భాస్కర్ నాయక్, తహశీల్దార్లు కెవిఆర్కె ప్రసాద్, కృష్ణ, ఎంపిడివోలు హాంకుబాబు, శుభాషిణి, ఐటిడిఏ అధికారులు శ్రీకాంత్, మధుకర్, శాఖల అధికారులు శివాలాల్, శివకృష్ణ, వెంకటస్వామి, నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, లగడపాటి రమేష్, పొలమూరి శ్రీనివాస్, నూనావత్ గోవిందు, లింగయ్య, అజయ్, యాండ్ర మహేష్, నగేష్, పూనెం శ్రీను, గౌస్, నాని, వెంకటేష్, హరీష్, రమణ, జక్రయ్య, వీరయ్య, చంద్రయ్య, శ్రీనివాసరెడ్డి, కొల్లి నాగేశ్వరరావు, ఆకుల వెంకటేశ్వర్లు, పూర్ణ, పున్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
