డా,బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా నేటి యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలి.
కొండన్న గూడా మాజీ సర్పంచ్ వై, శ్రీనివాస్ యాదవ్ ఎమ్ ఆర్ పి ఎస్ సీనియర్ నాయకులు ఇప్పల పల్లి దర్శన్
నమస్తే భారత్,షాద్ నగర్ అప్రి14:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొండన్న గూడా గ్రామం లొ ఘనంగా డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత దళిత హక్కులకు మార్గదర్శకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రనికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త అని అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పిఅని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్దేశంచేసిన మహానీయుడని కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా నేటి యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో. పాప యాదవ్, విష్ణు, మల్లేష్,నాగి రాములు, ముసలయ్య, యాదయ్య గౌడ్, చంటి, మహిళలు గ్రామస్తులు యువత పాల్గొన్నారు..
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
