భారతరత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలను.. కొనసాగిద్దాం
షాద్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కొందూటి నరేందర్ ..
షాద్ నగర్ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా డా. బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
నమస్తే భారత్,షాద్ నగదు ఏప్రిల్14:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని షాద్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కొందూటి నరేందర్ కొనియాడారు.సోమవారం135వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. షాద్ నగర్ ముఖ్య కూడలి మరియు ఫరూఖ్ నగర్ అంబేద్కర్ విగ్రహాలకు మాజీ మార్కట్ చైర్మన్ వంకాయల నారాయణ రెడ్డి,బిఆర్ఎస్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్, ఎమ్మె సత్యనారాయణ,కొత్తూరు మున్సిపల్ చైర్మన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్,వెంకట్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కానుగు అంతయ్య,జిటి శ్రీనివాస్,మాజీ కో ఆప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్,మాజీ ఎంపిటిసి రామకృష్ణ, బిఆర్ఎస్ నాయకులు పిల్లి శేఖర్,లక్ష్మణ్ నాయక్,చీపిరి రవి యాదవ్,అహ్మద్ ఏజాజ్ అడ్డు,యాదగిరి చిన్న,సుధీర్,రాఘవేందర్,లంకాల రాఘవేందర్,గుండు అశోక్,శ్రీశైలం, మహిమూద్,సాదిక్,గుట్క పాండు,శీలం శ్రీకాంత్, భువనేశ్,కటిక బళ్ళు,చెరుకు శివ,శ్రీశైలం,తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

