చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు కేటాయింపులేవి? అంబేద్కర్ అభయహస్తం అటుకెక్కినట్టేనా?

కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డెల రామ్మూర్తి

చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు కేటాయింపులేవి?  అంబేద్కర్ అభయహస్తం అటుకెక్కినట్టేనా?

నమస్తే భారత్ :-మరిపెడ :  2025- 26 ఆర్థిక సంవత్సరంలో 3,04,965 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు  కేటాయింపు జరగలేదని అంబేద్కర్ అభయహస్తానికి ఏటా 750 కోట్ల రూపాయల కేటాయిస్తామాన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోయిందని చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డెల రామ్మూర్తి అన్నారు. బడ్జెట్ ను సవరించి దళితుల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి వారి ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని  డిమాండ్ చేశారు. కెవిపిఎస్ మరిపెడ మండల కమిటీ విస్తృతస్థాయి సమావేశం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో  బాణాల ఎల్లయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రామ్మూర్తి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 18 శాతం ఉన్న దళితులకు ప్రతి ఏటా బడ్జెట్లో అంకెలు పెంచుతూ ఖర్చులు మాత్రం తుంచుతున్నారని 2024- 25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ లో నూటికి 30% కూడా ఖర్చు చేయలేదన్నారు 2023- 24 బడ్జెట్లో 13,617 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదని ఆర్థిక మంత్రి శాసనసభలో ప్రకటించడం విడ్డురంగా ఉందన్నారు.   కాగితాల్లో అంకెలుపెద్ద మొత్తాలలో  పెంచుతున్నారని అవి ఖర్చు చేయని నిధులను సబ్ ప్లాన్ చట్టం ప్రకారంగా వచ్చే ఏడాది బడ్జెట్లో ఖర్చు చేయాలని చట్టం నిబంధనలను  ఉల్లంఘిస్తున్నారని చెప్పారు .దళితుల యొక్క ఆవాసాలు విద్యా వైద్యం రహదారులు త్రాగునీరు వంటి మౌలిక ప్రత్యక్ష ప్రయోజనాలపై దృష్టి సారించలేదని చెప్పారు రాష్ట్రంలో 64 లక్షల జనాభా కలిగిన దళితులకు కనీస ప్రాథమిక అవసరాలు తీర్చే విధంగా బడ్జెట్ ను సవరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ ఏ బి సి గ్రూపులుగా విడగొట్టిన ప్రభుత్వం, పెరిగిన దళిత జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు పెంచలేదన్నారు. గత ఏడాది క్రిందట చేవెళ్ల డిక్లరేషన్ ప్రకటించిన ప్రభుత్వం ఏటా 750 కోట్ల రూపాయలు కేటాయిస్తామని 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయహస్తం కింద కేటాయిస్తామన్న మాటకు ఈ బడ్జెట్ లో నయా పైస కేటాయించలేదని విమర్శించారు. మూడు కార్పొరేషన్లుగా విడగొట్టి దళితుల యొక్క మౌలిక అభివృద్ధికి కృషి చేస్తామన్న మాట నీటి మూటగా మారిందని   ప్రభుత్వం ఏర్పడి 15 మాసాలు గడిచినప్పటికీ దళిత అభివృద్ధి శాఖకు ఎందుకు మంత్రిని నియమించలేదో రాష్ట్ర ప్రభుత్వం దళిత సమాజానికి సమాధానం చెప్పాలన్నారు.రాష్ట్రంలో దళితులు అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు.  సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీల బకాయి పెండింగ్లో ఉండటం సరికాదన్నారు.  హాస్టల్ లో అద్దె భవనాల చెల్లింపులో జాప్యం జరుగుతుందన్నారు .ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం బాధితులకు సరైన సమయంలో చెల్లించడం లేదన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతుల ప్రోత్సాహకాలు కూడా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని చెప్పారు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 2016 నుంచి నేటి వరకు పెండింగ్లో ఉండటం విచారకరమన్నారు  గత ఏడాది సుమారు పది శాఖలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు పేదల భూ పంపిణీ ఊసే లేదన్నారు దాడులకు  గురవుతున్న వారికి నష్టపరిహారం తక్షణ సహాయం అందించడం లేదన్నారు.పునరావాసం కల్పించడం లేదని చెప్పారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం హైపర్ కమిటీ సమావేశం జరగట్లేదన్నారు ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల పై నోడల్ ఆఫీసర్ ద్వారా ఆడిట్ చేయించాలన్నారు సబ్ ప్లాన్ నిధులలో జవాబు ద్వారా తనాన్ని పెంపొందించాలని ఎస్సీ ఎస్టీ శాఖల సంక్షేమ అభివృద్ధి పథకాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 5 నుండి 30 వరకు మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన జాతర్ల సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సామాజిక ఉద్యమకారులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి యువకులు మేధావులు పాల్గొనాలని కోరారు.సమావేశంలో  జిల్లా ఉపాధ్యక్షులు  జిన్నా లచ్చన్న, సీనియర్ నాయకులు పాల్వాయి దుర్గయ్య, గౌరవ అధ్యక్షులు మల్లెపంగు విజయ్ ,మండల నాయకులు వడ్లకొండ గంగరాజు, జినక అరుణ అశోక్, గంగుల వెంకటేష్, పత్తిపాటి వినయ్, చింత వెంకటేష్, నందిపాటి నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ
నమస్తే భారత్ :-కేసముద్రం  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి...
అకాల వర్షాల వల్ల మామిడి, బొప్పాయి తోటల  నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి 
బిల్లు ప్రభుత్వానికి త్రిల్లు సార్ కి
పర్యవేషణ లోపం లేకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి
న్యాయ విజ్ఞాన సదస్సు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.సురేష్
ఈరోజు అత్యవసర సమయంలో రక్త  దానం చేసి మానవత్వాన్ని ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్  
రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని తీర్చాలనేదే  ముఖ్యమంత్రి తపన