గొప్ప సామాజిక సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, ఆర్థిక వేత్త, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్14:భారతదేశ గొప్ప సామాజిక సంస్కర్త, రాజనీతజ్ఞుడు, ఆర్థిక వేత, భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్ర భారతదేశపు తొలి చట్ట మంత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, ఆయన జీవన విధానం నేటితరం నాయకులకు ఆదర్శనీయమని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. మధ్యప్రదేశ్ లోని మౌ అనే గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి దేశ రాజ్యాంగాన్ని లిఖించే స్థాయికి ఎదిగారని చెప్పారు. శిక్షణ పొందండి- సంఘటితం కండి, మనమందరం సమానమే- సమాన హక్కులు ఉండాలి అనే నినాదాలతో దళిత బహుజన జాతిని జాగృతం చేసి, అన్ని రంగాలలో రాణించే విధంగా చైతన్య పరిచ్చారని అభిప్రాయపడ్డారు. ఆయన రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అయిందని, రాజ్యాంగ ఫలాలను దళిత బహుజనులు అనుభవించినప్పుడే ఆయన ఆశయ సాధనకు నిజమైన ఫలితం దక్కుతుందని అన్నారు. ఆయన అనుసరించిన విధానం, ఎదిగిన తీరు మనందరికీ ఆదర్శనీయమని, అన్ని వర్గాల ప్రజలు ఆయన సూచించిన మార్గంలో పయనించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

