జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్లు కట్టించి ఇవ్వాలి
* ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ స్థలంతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలని సంఘ సేవకుడు అంబేద్కర్ వాది ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ విజ్ఞప్తి చేశారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ స్థలాలతోపాటు ఇంటిని నిర్మించి తదితర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని స్థానిక గంగాబిషన్ బస్తి ప్రాంతంలో నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. ఈ దీక్షలు బుధవారం నాటికి ఏడవ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని ఆచార్య డాక్టర్ మద్దెల శివ కుమార్ తోపాటు తదితరులు సందర్శించి మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మద్దెల శివకుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల కోరికను ప్రభుత్వం తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను ప్రజా సమస్యలను తమ కలం ద్వారా పత్రికల్లో రాస్తూ సేవలందిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో గంగాబిషన్ ఏరియాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కొరకు స్థలము కేటాయించడం జరిగిందని కానీ ఆ స్థలాన్ని పంపిణీ చేయడంలో ఆలస్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలను పంపిణీ చేయడంతో పాటు అందులో ఇంటి నిర్మాణాన్ని చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల డిమాండ్ న్యాయమైనది...
జర్నలిస్టులు తమ ఇండ్ల సాధన కోసం చేస్తున్న నిరసన న్యాయమైనదని సింగరేణి రిటైర్డ్ జిఎం ఎ.ఆనందరావు అన్నారు. కోడి కుయకముందే సమాజాన్ని మేల్కొలి ఎక్కడ ఏ సంఘటన జరిగిన తక్షణమే వార్త ప్రపంచానికి చాటిచెప్పే జర్నలిస్టులు దశాబ్ద కాలంగా ఇండ్ల స్థలం కోసం ఎదురుచూస్తున్నారని వారి కోరికను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. సామాజిక వేత్త యువ నాయకులు బండి విజయ భాస్కర్ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించి మాట్లాడారు. రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో వున్నప్పుడు జర్నలిస్టులకు ఆనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను విస్మరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎంఎఫ్ నిధులతో పట్టణంలో రోడ్డు మీదే రోడ్డు వేస్తూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆ నిధులతో జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయించిన ఇండ్ల స్థలాలకు మానవత్వంతో నగదు చెల్లించి కొనుగోలు చేసి ఇవ్వవొచ్చని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ ను తీర్చాలన్నారు. పర్యావరణ ప్రేమికుడు మొక్కల రాజశేఖర్ నిరసన శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపి మాట్లాడారు. మొక్కల రాజశేఖర్ గా నన్ను ప్రపంచానికి పరిచయం చేసిందే మీడియా సోదరులని అలాంటి మీడియా మిత్రులు తమ సమస్యల కోసం నిరసన చేపట్టడం ఎంతో బాధాకరమని అన్నారు. మీడియా వల్లే నాకు ప్రధాని మోడీతో మాట్లాడే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని జర్నలిస్టుల దీక్షకు మద్దతు తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
