సింగరేణి హైస్కూల్లో సీ.బీ.ఎస్.ఈ బోధనకు అనుమతి మంజూరు
* ధ్రువీకరణ పత్రం జారీ చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
* సంస్థ ఛైర్మన్ ఎన్.బలరామ్ ప్రత్యేక చొరవతో సింగరేణి పాఠశాలలో సీ.బీ.ఎస్.ఈ బోధనకు అనుమతి
* ఈ ఏడాది నుంచి తరగతుల ప్రారంభం
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: సింగరేణి ప్రాంతంలో కార్మికుల పిల్లలకు సెంట్రల్ సిలబస్ తో కూడిన విద్యను అందించాలన్న ఉద్దేశంతో సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తీసుకున్న ప్రత్యేక చొరవతో సత్ఫలితానిచ్చింది. రామగుండం-2 ఏరియాలో గల సింగరేణి హైస్కూల్ సెక్టర్-3 పాఠశాలలో సీ.బీ.ఎస్.ఈ బోధనకు అనుమతి మంజూరు అయింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శాఖ నుండి ఆ పాఠశాలకు అప్లికేషన్ ను మంజూరు చేస్తూ శనివారం సర్టిఫికెట్ జారీ అయింది. సింగరేణి విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలన్న ఉద్దేశంతో ఏడాది క్రితం సంస్థ ఛైర్మన్ ఎన్.బలరామ్ సీ.బీ.ఎస్.ఈ వారిని సంప్రదించారు. సింగరేణి పాఠశాలలు అన్ని రకాల సౌకర్యాలతో ల్యాబ్ లు క్రీడ మైదానాలు విశాలమైన తరగతి గదులు వంటి వసతులతో ఉన్నాయని తగిన అర్హతలు గల బోధనా సిబ్బంది కూడా ఉన్నందువల్ల కార్మికుల పిల్లలకు ఉన్నత స్థాయి విద్యను అందించేందుకు ఈ పాఠశాలల్లో సీ.బీ.ఎస్.ఈ బోధనకు అనుమతించాలని కోరారు. దీనిపై గత ఏడాది డిసెంబరు నెలలో సీ.బీ.ఎస్.ఈ అధికారుల బృందం రామగుండం-2 ఏరియాలో గల సింగరేణి హైస్కూల్ ను గత ఏడాది డిసెంబర్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలో సందర్శించి అక్కడ గల వసతుల్ని పరిశీలించారు. సీ.బీ.ఎస్.ఈ బోధనకు ఈ పాఠశాల అనుకూలంగా ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ పాఠశాలకు తమ ఆఫ్లియేషన్ (3630560) మంజూరు చేస్తూ సర్టిఫికేట్ ను జారీ చేసింది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్ఈ తరగతులకు అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇక్కడ సీ.బీ.ఎస్.ఈ విద్యాబోధన ప్రారంభం కానుంది. సీ.బీ.ఎస్.ఈ బోధనతో సింగరేణి పాఠశాలలకు పూర్వవైభవం చేకూరనున్నదని కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి కాలరీస్ అభివృద్ధి కోసమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఆయన ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలోనూ సీబీఎస్ఈ పాఠశాలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

