జర్నలిస్టుల సమస్యల పై ప్రభుత్వం మౌనం విడాలి

రాబోయే రోజుల్లో పాలకుల నిర్లక్ష్యంపై పోరాటం తప్పదన్న టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు  మామిడి సోమయ్య

జర్నలిస్టుల సమస్యల పై ప్రభుత్వం మౌనం విడాలి

మహాసభలో నూతన కార్యవర్గం ఏర్పాటు

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందునూరి నాగరాజుగౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షుడిగా పిట్ల శంకర్,

వర్కింగ్ ప్రెసిడెంట్ బి.శివకుమార్, కార్యదర్శి ఏ. గోవిందరావు ఎన్నిక

 

కుత్బుల్లాపూర్ : రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సమస్యల విషయంలో పాలకులు ఇంకా నిర్లక్ష్యం చేస్తే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం టీడబ్ల్యూజేఎఫ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తృతీయ మహాసభ సూరారంలోని వీఐపీ గార్డెన్ లో ఘనంగా జరిగింది. అధ్యక్షుడు గడ్డమీది అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం బాటలోనే నడుస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వలేక పోయిందని, ఇళ్ళ స్థలాల విషయంలో చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సమస్యల పట్ల గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తే పాత్రికేయుల పోరాటం తప్పదని
అన్నారు.రాష్ట్రంలో ప్రత్యామ్నాయ జర్నలిస్టు యూనియన్ గా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నెంబర్ వన్ యూనియన్ గా బలపడిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జర్నలిస్టుల నుంచి విశేష స్పందన లభిస్తుందని, త్వరలో అన్ని జిల్లాల్లో మహాసభలు పూర్తి చేసి రాష్ట్ర మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయని, ఒకవైపు యాజమాన్యాలు,
ప్రభుత్వాలు పట్టించుకోక, మరోవైపు దాడులు,అవమానాలు పెరిగిపోతున్నాయని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు శిక్షణతో కూడిన వృత్తినైపుణ్యతను పెంపొందించుకొని విధినిర్వహణలో సమర్ధవంతంగా ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రంలోని కొన్ని జర్నలిస్టు సంఘాలు ప్రజల, పాత్రికేయుల పక్షం కాకుండా పాలకుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలను విస్మరించాయని విమర్శించారు. టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ పాలకుల పక్షం కాకుండా కేవలం పాత్రికేయుల పక్షాన నిలిచి సమస్యలపై పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్ కే సలీమా మాట్లాడుతూ., తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు జర్నలిస్టులను పూర్తిగా విస్మరించాయని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు వంటి సమస్యలు పరిష్కరించాల్సివుందని, హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో ఫెడరేషన్ జరుపబోయే ఉద్యమాల్లో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.

మహాసభలో నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందునూరి నాగరాజుగౌడ్(జెమినీ నాగరాజు), కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షుడుగా పిట్ల శంకర్ (విశాలాంధ్ర), వర్కింగ్ ప్రెసిడెంట్ గా బి.శివకుమార్ (శనార్తి తెలంగాణ),కార్యదర్శిగా ఏ. గోవిందరావు (వార్త),
ఉపాధ్యక్షులుగా ఈ. మంజుల, (ప్రజా వినికిడి), ఎం. దివాకర్, కావలి మోహన్ ముదిరాజ్, ప్రచార కార్యదర్శిగా పి. బ్రహ్మచారి (తెలుగు ప్రభ),సహాయ కార్యదర్శిగా కొండ సంజీవ్ కుమార్ (ఆంధ్రప్రభ),కోశాధికారిగా మన్నే వినోద్ (నవతెలంగాణ),
కార్యవర్గ సభ్యులుగా లక్ష్మి (సాక్షిత), సుస్మిత (ప్రజాకలం),  రాజు (ప్రజాదర్బార్) తదితరులను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

      ఎలక్ట్రానిక్ మీడియా కమిటీలో
తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీబీజేఏ) కన్వీనర్ గా రాజేష్, కో-కన్వీనర్లుగా కోటేశ్వరరావు, దుర్గారావు, శ్రీనివాస్, సత్య, సత్యం తదితరులు ఎన్నికయ్యారు.

IMG-20250419-WA0001

Views: 11

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
తేదీ, ఏప్రిల్, 19, 2025నమస్తే భరత్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్  కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో...
భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి.
డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు.
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం
ఎక్సలెంట్ భాషా హై స్కూల్ నందు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే  వేడుకలు
కన్నా సునీత - వేణు గౌడ్ ల సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొన్న  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మి గౌడ్
డోర్నకల్ మాజీ కౌన్సిలర్ జర్పుల వీరన్న కుటుంబానికి  ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన  మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్