గిరిజన తండాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మరిపెడ కాంగ్రెస్ నాయకులు

నమస్తే భారత్ :-మరిపెడ: గిరిజన తండాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరరెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్ ఆదేశాలమేరకు శనివారం మరిపెడ మండలం లూనావతండ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ఆర్ఆజీఎస్ కింద మంజూరు అయిన రూ.9 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. అందులోని భాగంగానే ఉచిత బస్ ప్రయాణం. సన్న బియ్యం, సబ్సిడీ గ్యాస్, రైతు బందు, రూ.500 బోనస్, రైతు రుణ మాఫీ, సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు ఇలా అనేక పథకాలు చేపట్టి అమలు చేయడం జరుగుతుందన్నారు. పల్లెలే దేశానికి పటుకొమ్మలని, పల్లెలు అభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకు ప్రల్లె ప్రయోజనాలకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్, జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు రవినాయక్, గండి వీరభద్రం, తండ నాయకులు లూనావత్ వెంకన్న, బానోతు బిల్లు, బానోతు రెడ్డి, లూనావత్ శంకర్, లూనావత్ భద్రు, బొడ్డు వెంకన్న. లూనావత్ మంచా, పంతులు, బాపోతు భగ్న, రవి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

