యాసంగి పంటల కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తేదీ, ఏప్రిల్ 19, 2025,
నమస్తే భరత్ నిర్మల్: పట్టణంలోనే కలెక్టర్లు, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్ సమావేశం నిర్వహించారు. శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్ సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు పూర్తిచేసిన ధాన్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అన్ని జిల్లాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తరుగు పేరిట రైతులకు ఎటువంటి కోతలు పెట్టవద్దని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నందున ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. దేశంలో అత్యధికంగా వరి పంట పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు. వానాకాలం పంట కొనుగోలు సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినందుకు అధికారులందరికీ మంత్రి అభినందనలు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన వివరాలను మంత్రికి కలెక్టర్ తెలియజేశారు. నిర్ణీత సమయానికి జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఇటువంటి ఇబ్బందులు లేకుండా వరి కొనుగోలును నిర్వహిస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ మంచిర్యాల జిల్లా కుమార్ దీపక్, సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
