నీటి లోతు తెలియకుండా ఈత గురించి అందులోకి దూకి విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు

ఈత సరదా విషాదంగా మారకూడదు

 నీటి లోతు తెలియకుండా ఈత గురించి అందులోకి దూకి విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు

తల్లిదండ్రులు వెంబడి ఉండి పిల్లలకు ఈత నేర్పించాలి 

వేసవి సెలవులలో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్ళుచున్నారు ఒక కన్నేసి ఉంచాలి 

తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు,కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి.

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు 

తేదీ:19-ఏప్రిల్-2025 నమస్తే భారత్ : పోలీస్ కమిషనర్ మేడమ్ గారు మాట్లాడుతూ వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ  వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి   చెరువులు ,కాలువల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ఇట్టి క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుండటం వలన అందరూ ఇట్టి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదంగా మారకూడదుచూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు.ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈత ను నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యముగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువుల వద్దకు కాలువల వద్దకు కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా స్నేహితులతో బయటకు జాగ్రత్త వహించాలని సూచించారు, ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారు  పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినట్లయితే పిల్లల ప్రాణానికి ప్రమాదమని ఇట్టి విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలను యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కమిషనర్ మేడమ్ గారు సూచించారు. కమిషనర్ కార్యాలయము నుండి జారీ చేయనైనది.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
తేదీ, ఏప్రిల్, 19, 2025నమస్తే భరత్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్  కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో...
భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి.
డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు.
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం
ఎక్సలెంట్ భాషా హై స్కూల్ నందు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే  వేడుకలు
కన్నా సునీత - వేణు గౌడ్ ల సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొన్న  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మి గౌడ్
డోర్నకల్ మాజీ కౌన్సిలర్ జర్పుల వీరన్న కుటుంబానికి  ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన  మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్