పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం తేదీ: 18-04-2025 రాత్రి చిన్నకోడూర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని " చౌడారం " గ్రామంలో నిర్వహించడం జరిగింది

పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం తేదీ: 18-04-2025 రాత్రి చిన్నకోడూర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని

తేదీ: 19-ఏప్రిల్-2025 నమస్తే భారత్ : చిన్నకోడూర్ ఎస్ఐ బాలకృష్ణ, ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రాలు తంత్రాలు అంటూ మూఢనమ్మకాలు నమ్మవద్దని,మూఢనమ్మకాలు నమ్మి ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు. ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలని, ఈ రోజుల్లో ఆసుపత్రులలో ఆధునిక వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు. లేనిపోని మూఢనమ్మకాలతో  ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకొని  కొట్టుకోవడం మంచి పద్ధతి కాదన్నారు, ఏదైనా సమస్య ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని  ఇరు వర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి  గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు  సీసీ కెమెరాలు 24 గంటలపాటు ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీని ఇస్తాయని తెలిపారు ఆశ, భయము, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి, బ్యాంకు అధికారులు అని ఫోన్ చేస్తే నమ్మవద్దు, అకౌంట్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ గుర్తుతెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దు, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు ఆన్లైన్ గేమ్స్ ఆడి మీరు మీ కుటుంబాలను రోడ్డున పడవేయవద్దు చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దు ఉన్న కుటుంబ సభ్యులను దుఃఖసాగములో ముంచవద్దు  రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి   గంజాయి ఇతర మత్తు పదార్థాలపై  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇంట్లో ఉన్న యువకులు, పిల్లలపై  ఒక కన్నేసి ఉంచాలి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు గమనిస్తూ ఉండాలి మూఢనమ్మకాలు, చేతబడులు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలు, సామాజిక రుక్మతల గురించి  సిద్దిపేట పోలీస్ కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు రాజేష్,, భాస్కర్, యాదగిరి నర్సింలు, బాబు, మంజుల, రాజమణి, వెంకటేష్ నాటకం పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజాప్రతినిధులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
తేదీ, ఏప్రిల్, 19, 2025నమస్తే భరత్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్  కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో...
భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి.
డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు.
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం
ఎక్సలెంట్ భాషా హై స్కూల్ నందు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే  వేడుకలు
కన్నా సునీత - వేణు గౌడ్ ల సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొన్న  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మి గౌడ్
డోర్నకల్ మాజీ కౌన్సిలర్ జర్పుల వీరన్న కుటుంబానికి  ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన  మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్