సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫోటోలు, మరియు రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం
IT చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు
ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫోటోలు మార్పించేస్తూ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పోస్టులు పెట్టవద్దని, అలా పెట్టిన వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు తప్పుడు వార్తలు పెట్టే వారిపై IT యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని సూచించారు.
సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన, షేర్ చేసినా వారి సమాచారాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్ కు 8712667100
తెలియజేయాలని అట్టి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుంది.
ఈ టెక్నాలజీ యుగంలో వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ద్వారా సమాచారము క్షణాల్లో కొన్ని లక్షల మందికి చేరుతుందని పంపించే సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు.
సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను మంచి మంచి కార్యక్రమాలకు ప్రజలను యువతను చైతన్యపరిచే విధమైన పోస్టులు చేస్తూ మంచితనానికి ఉపయోగించుకోవాలని సూచించారు.
ముఖ్యంగా యువత వారి యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలని, సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెట్టి ఇబ్బంది పడవద్దని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పోలీస్ కమిషనర్ మేడమ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
