అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
- అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) డిమాండ్.
నమస్తే భారత్ / మద్దూరు, : మద్దూరు మండలం నందిపాడు, పల్లెర్ల గ్రామ శివార్లలో సోమవారం సాయంత్రం వడగండ్లతో కూడిన వర్షానికి నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి డిమాండ్ చేశారు. అఖిలభారత ఐక్య రైతు సంఘం మద్దూరు మండల కమిటీ అధ్యక్షులు బండమీది రాములు ఆధ్వర్యంలో నష్టపోయిన రైతు పొలాలను నందిపాడు, పల్లెర్ల గ్రామ శివార్లలో పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఐయుకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి, ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మద్దూరు సబ్ డివిజన్ కార్యదర్శి కొండ నర్సింలు, ఏఐయుకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బి నారాయణ మాట్లాడుతూ నందిపాడు పల్లెర్ల గ్రామాలలో దాదాపు 150 ఎకరాలలో వరి పంట వడగండ్లకు నష్టపోవడం జరిగిందన్నారు. రైతులు అనేక కష్టనష్టాలకోర్చి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తీసుకువచ్చి తమ పొలాలలో వరి, కీరదోస వేయడం జరిగింది. 15 రోజులు అయితే పంట చేతికి వస్తుంది అనుకునే సందర్భంలో వర్షంతో పాటు వడగండ్లు కురవడంతో రైతులు నష్టపోయారన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించి వారికి ఎకరాకు 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అంబటి నరసింహులు రైతు సంఘం మండల నాయకులు బోడు కిష్టప్ప, బి ఆంజనేయులు, నందిపాడు గ్రామ రైతులు గొల్ల గంగప్ప, డి మైపాల్ , రాజు, మద్దూరు గుండప్ప, మదరప్ప, మొగులమ్మ, పెద్ద చెన్నప్ప, పీర్ సాబ్, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

