జిల్లా కేంద్రంలో "రాజ్యాంగ నిర్మాతకు 134వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు.
సామాజిక సమానత్వం, న్యాయం, మానవ హక్కుల పరిరక్షణకు నిలువెత్తు ప్రతిరూపం 134 వ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ అని స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
తేదీ, ఏప్రిల్ 14, 2025
నమస్తే భరత్
నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం భారతరత్న, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ, జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అధికారులు, నాయకులు, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో మరిచిపోలేని మహానాయకులని, అణచివేతల నుంచి ప్రజలను విముక్తి చేయాలన్న తపనతో ఆయన సాగించిన ఉద్యమం భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలుస్తోందని తెలిపారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ప్రపంచానికే మార్గదర్శకమైన భారత దేశ రాజ్యాంగాన్ని రూపొందించారని, ప్రపంచ మేధావులలో అంబేద్కర్ ముందు వరుసలో నిలుస్తారని అన్నారు. రాజ్యాంగాలు మనుగడలో ఉన్నంతకాలం అంబేద్కర్ పేరు చిర స్థాయిలో నిలుస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగం నేటికీ ఇంత పటిష్టంగా ఉందంటే దానికి కారణం అంబేద్కర్ కృషియేనని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల వల్లనే నేడు బడుగు, బలహీన వర్గాల ప్రజలు సైతం అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, మాట్లాడుతూ, భారత రాజ్యాంగం రూపొందించడంలో బి. ఆర్ అంబేద్కర్ ముఖ్య భూమిక పోషించారని తెలిపారు. ఆనాడు దేశంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న అసమానతలు రూపుమాపాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో వారి హక్కులు పొందుపరచారని తెలిపారు. పేద కుటుంబంలో జన్మించి, ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి, ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప మేధావిగా అంబేద్కర్ వెలుగొందారని తెలిపారు. సమాజంలో ఉన్న అసమానతలు తొలగించేందుకై అనుక్షణం పోరాడారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అంబేద్కర్ ను మార్గదర్శకంగా తీసుకొని, వారు చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖల అధికారులు రాజేశ్వర్ గౌడ్, శంకర్, శ్రీనివాస్, లత, అధికారులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

