విద్యార్థులలొ సృజనాత్మకతను పెంచే కార్యక్రమాలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : విద్యార్థులలో సృజనాత్మకతను పెంచే కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీ గార్డెన్ ఫంక్షన్ హల్ లో జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ల నైపుణ్యాల ప్రదర్శన వేదిక విద్యా కదంబం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై, జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అమలు జరుగుతున్న మౌలిక భాషా గణిత సామర్ధ్యాల సాధన కార్యక్రమాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్ ను సందర్శించి, విద్యార్థులు చేస్తున్న వివిధ కృత్యాల్లో పాలుపంచుకొని, వారిని పలు రకాలుగా ప్రశ్నిస్తూ, విద్యార్థుల ద్వారా సమాధానాలు రాబట్టి , విద్యార్థులను అభినందించారు.జట్టుకృత్యాలలో విద్యార్థులతో మమేకమై ఈ కృత్యాల ద్వారా ఆనందం పొందుతున్నారా ? అని అడగడంతో పాటు, మధ్య మధ్యలో పిల్లలను చదివే సామర్థ్యాన్ని పరీక్షించారు. ఆంగ్లమును అనర్గళంగా చదివే విద్యార్థులను చూసి ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చింతల్ దిన్నె పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన మౌఖిక గణితానికి ప్రత్యేకంగా అభినందించారు. ఏడాదిపాటు నిర్వహించిన కార్యక్రమాలను ఈ విధంగా ఘనమైన ముగింపు కార్యక్రమం చేయడం బాగుందని, ఇదే స్ఫూర్తితో రానున్న విద్యాసంవత్సరం మరింత మెరుగ్గా పనిచేయాలన్నారు. విద్యాశాఖ పట్ల ప్రత్యేక దృష్టి ఉన్న కారణంగానే మన జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధన సాగుతుందని, ఇలాంటి మరెన్నో వినూత్న కార్యక్రమలు జిల్లా విద్యాశాఖ నుంచి చేయాలని, అందుకోసం తన వంతు సహకారం అందిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించుటకు ప్రవేశపెట్టిన యంగ్ ఆరేటర్స్ కార్యక్రమం ఆరంభంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, బాలల దినోత్సవం రోజు నిర్వహించిన కార్యక్రమం ద్వారా కొంత మెరుగుపడినట్లు , నేడు ఒక స్థాయి మేరకు ఫలితాలు సాధించిందని, ఉపాధ్యాయలలో కొంత కొత్తదనం కనిపించిందని,ఇది ఒక నిరంతర ప్రక్రియ అని, ఈ కార్యక్రమం మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి పూర్తి సహాయ సహకారాలు జిల్లా ద్వారా అందుతాయని, పిల్లల నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వివిధ పాఠశాల ఉపాధ్యాయులను, హెచ్ ఎం లను, సహకరిస్తున్న అలోకిత్ ఫౌండేషన్ సభ్యులైన సాయి ప్రమోద్, యదునందన్ తదితరులను ఆమె అభినందించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాoగ్వర్ తో కలిసి కలెక్టర్ వీక్షించారు. సీఎం, జిల్లా కలెక్టర్ గా వ్యవహరిస్తూ ఇద్దరు విద్యార్థులు చేసిన ప్రదర్శన చాలా బాగుందని జిల్లా కలెక్టర్ ఆ ఇద్దరు చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి గోవింద రాజులు, ఏఎమ్ఓ విద్యాసాగర్ ఎమ్ ఈ ఓ లు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చిన్నారులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

