మిర్చి కింటాకు 25000 మద్దతుగా ప్రకటించాలని సిపిఎం పార్టీ అలవాల వీరయ్య
నమస్తే భారత్ :-దంతాలపల్లి : సిపిఎం పార్టీ దంతాలపల్లి మండల కమిటీ సమావేశంలో బండి శ్రీనివాస్ అధ్యక్షతన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అలవాల వీరయ్య మాట్లాడుతూ మండలం ఏర్పాటు మాత్రమే జరిగింది కానీ దానికి భవనాలు లేని కారణంగా అద్దె భవనాల్లోనే కొనసాగుతూ అరాకొరగా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటున్నటువంటి కార్యాలయాన్ని తక్షణమే నిర్మించాలని మండలం లోపల కస్తూరిబా పాఠశాలను ప్రారంభించాలని మోడల్ స్కూల్ అదేవిధంగా అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధర ప్రకటిస్తూ మిర్చి కింటాకు 25000 మద్దతుగా ప్రకటించాలని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆసరా పెన్షన్ 4000 రూపాయలు ఇవ్వాలని వికలాంగులకు 6000 రూపాయలు ఇంకా అర్హులైనటువంటి ఓఏపీ వితంతు అందరికీ తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని అర్హులైన వాళ్లందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రతి మహిళకు 2500 తక్షణమే వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని ఇంకా అరువులుగా ఉండి 500 కు గ్యాస్ సప్లై జరగటం లేదు 200 యూనిట్ల కరెంటు అందరికీ అందటం లేదు దీనిని స్పెషల్ డ్రైవ్ గా పెట్టి ప్రభుత్వం అర్హులందరికీ అందేలా చేయాలని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ తక్షణమే చేపట్టి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాన్ని సృష్టించాలని ప్రాజెక్టు ప్రారంభం అయ్యేంతవరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని ఆటో కార్మికులకు నెలకి 5000 రూపాయలు అందేటట్టుగా చూడాలని ప్రభుత్వం విద్యావ్యవస్థను అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి వైద్యం అందరికీ ఉచితంగా అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ గ్రామాల్లోపల పాలనా వ్యవస్థ కుంటు పడడం కారణంగా మంచినీటి ఎద్దడి వీధి దీపాలు లేకుండా ఉండడం ఇంకా గ్రామాల్లో మౌలికమైనటువంటి వసతులు లేకుండా పాలనా వ్యవస్థ కొంటుబడ్డది అధికారులు స్పెషల్ ఆఫీసర్లు పట్టించుకున్న పాపాన పోవట్లేదు కావున ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తు లోపల సిపిఎం పార్టీ పోరాటాలను ఉదృతం చేస్తారని తెలియజేస్తూ ఈ మండలంలో ఒక ప్రణాళిక బద్ధంగా సమస్యల పరిష్కారం వైపు ప్రజలను సమీకరించి ఐక్య ఉద్యమాలు నిర్వహించడానికి సమైక్యమవుతుందని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గునిగంటి మోహన్ సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కొమ్మినేని రామేశ్వరన్ కొమ్మినేని వెంకటరమణ సాయి గారు జక్కుల లింగయ్య కారపాటి వెంకన్న యాకూబ్ భాను సర్వాన్ సుధాకర్ మల్లయ్య వీరభద్రం నాగరాజు గొడిశాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

