షాద్ నగర్‌లో బీసీ సేన ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా.
నమస్తే భారత్,షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బీసీ సేన షాద్ నగర్ మహిళా అధ్యక్షులు బాస వరలక్ష్మి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి & పంచాంగ శ్రవణం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఉగాది పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులను శాలువాలతో సన్మానించడం జరిగింది. అనంతరం, ఆయ్యగారి ద్వారా పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించబడింది. పండుగ సందర్భంగా ఉగాది పచ్చడి ప్రత్యేకతను వివరిస్తూ, సంవత్సర ఫలితాలపై పండితులు అవగాహన కల్పించారు.పలువురు నాయకుల పాల్గొనింపు ఈ కార్యక్రమంలో బీసీ సేన అసెంబ్లీ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్పా, చెన్న బాలారాజు, వరప్రసాద్, తంగేడు పల్లి శంకర్, భూషం నరేష్, బాస రాజేందర్, పాలరి శ్రీను, శివ ముదిరాజ్ సురేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.మహిళా నాయకుల్లో నవనీత, సౌజన్య, మమత, ఉమా దేవి, నారద బాలమణి, సుజాత, శాంత, శకుంతల, వసంత తదితరులు పాల్గొని ఉత్సాహభరితంగా పండుగను జరుపుకున్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

