విధినిర్వహణలో రాణిస్తున్న మహిళా అధికారులను సన్మానించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ & సిసిఐ రాష్ట్ర బృందం
నమస్తే భారత్,షాద్ నగర్, : షాద్ నగర్ డివిజన్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న మహిళా అధికారులను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు కన్జ్యూమర్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా (సి సి ఐ) రాష్ట్ర బృందం ఘనంగా సన్మానించింది.మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా, ఆర్డీవో శ్రీమతి ఎన్.ఆర్. సరిత, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి సునీత, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ శ్రీమతి విజయలక్ష్మి లను ఈ బృందం గౌరవప్రదంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సిసిఐ రాష్ట్ర అధ్యక్షులు మామిడి భీమిరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎన్. ప్రవీణ, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ, సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు పాల్గొని ఈ మహిళా అధికారులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సిసిఐ రాష్ట్ర అధ్యక్షులు మామిడి భీమిరెడ్డి మాట్లాడుతూ,"మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. కేవలం కుటుంబ వ్యవస్థకే కాకుండా, సమాజ నిర్మాణంలోనూ మహిళల పాత్ర అమోఘం. అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం లేకుండా ఎలాంటి పురోగతి సాధ్యం కాదు. వారు తమ విధి నిర్వహణలో చూపుతున్న నిబద్ధత, సమర్పణ గమనించదగ్గది" అని అన్నారు.సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు మాట్లాడుతూ, "షాద్ నగర్ డివిజన్లో ఉన్న మహిళా అధికారులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆర్డీవో సరిత, డి ఎ వో జ్యోతి, మున్సిపల్ కమిషనర్ సునీత, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ విజయలక్ష్మి, ఆర్టీసీ డిపో మేనేజర్ ఉషా, సిడిపిఓ షబానా, పోలీస్ అధికారి సుశీల లాంటి మహిళా మణులు ప్రజా సేవలో ముందున్నారంటే అది మహిళా లోకానికి గర్వకారణం. స్త్రీలు సమాజ సృష్టికర్తలు, వారి సేవను వెలకట్టలేం" అనిఅభిప్రాయపడ్డారు.సిసిఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎన్. ప్రవీణ మాట్లాడుతూ,"ఒక స్వచ్ఛంద సంస్థ మహిళల సేవలను గుర్తించి గౌరవిస్తుందంటే, అది సమాజ అభివృద్ధికి మంచి సూచిక. మహిళగా నేను సైతం ఆత్మసంతృప్తిని పొందుతున్నాను" అని భావోద్వేగంగా అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో రెడ్ క్రాస్, సిసిఐ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

