బెట్టింగ్ యాప్స పై అప్రమత్తంగా ఉండాలి
నమస్తే భారత్, డోర్నకల్ : ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్, గేమ్స్పై యువత అప్రమత్తంగా ఉండాలని డోర్నకల్ సీఐ రాజేష్ అన్నారు. డోర్నకల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ ముఖ్యంగా కొందరు ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ బారిన పడి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకొని, అప్పుల పాలై, వ్యసనాలకు అలవాటు పడి ఆత్మహత్యలకు పాల్పడుతూ వారి కుటుంబాలకు, తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలినస్తున్నారన్నారు. యువకులు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండి తమ ఆలోచన విధానాలను మార్చుకొని దూరంగా ఉండడమే మంచిదన్నారు. తల్లిదండ్రులు దూర ప్రాంతాల్లో ఉంటూ చదువుకుంటున్న వారి కుమారులకు డబ్బులను ఇస్టారీతిన పంపవద్దని, అలాగే బ్యాంకులకు సంబంధించిన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఇవ్వవద్దని వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. యువకులు తాము ఎంచుకున్న లక్ష్యాన్ని నెరవేర్చతూ ఉద్యోగాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సీఐ కోరారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

