తెలుగు మాస్టర్ చంద్ర ప్రకాష్ కు ఘనంగా వీడ్కోలు

- హరిపిరాల హైస్కూల్లో ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానోత్సవం

తెలుగు మాస్టర్ చంద్ర ప్రకాష్ కు ఘనంగా వీడ్కోలు

నమస్తే భారత్ :-తొర్రూరు :  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని హరిపిరాల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు బోధిస్తున్న తండాల చంద్ర ప్రకాష్ గౌడ్ ఉద్యోగ విరమణ సన్మానోత్సవ కార్యక్రమాన్ని గురువారం పాఠశాల ఆవరణంలో హెచ్ఎం బి. వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు మాస్టర్ చంద్ర ప్రకాష్ - శోభారాణి దంపతులను  ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమన్నారు. తెలుగు ఉపాధ్యాయుడు చంద్ర ప్రకాష్ తన సర్వీస్ లో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాడని కొనియాడారు. విద్యారంగా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేవన్నారు. తెలుగు మాస్టర్ చంద్ర ప్రకాష్ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని, ఈ వృత్తిలో విద్యార్థులకు సేవలందించి పదవీ విరమణ పొందుతుండటం ఆనందంగా ఉందన్నారు. అనంతరం చంద్ర ప్రకాష్- శోభారాణి దంపతులను పాఠశాల ఉపాధ్యాయ బృందం, పాఠశాల యాజమాన్య కమిటీ, బంధుమిత్రులు, విద్యార్థులు శాలువాలు, మేమొంటో, పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, ఆటపాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎం. రవి, సుధాకరా చారి, మధుకర్ రెడ్డి, రాజేశ్వర్, నారాయణ, కుమార్, సంపత్ కుమార్, శంకర్, సంపత్, రవీందర్ , తస్లీమా మహేందర్, ఆంజనేయులు, పిడి రాజు, రవి, మౌనిక, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ
నమస్తే భారత్ :-కేసముద్రం  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి...
అకాల వర్షాల వల్ల మామిడి, బొప్పాయి తోటల  నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి 
బిల్లు ప్రభుత్వానికి త్రిల్లు సార్ కి
పర్యవేషణ లోపం లేకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి
న్యాయ విజ్ఞాన సదస్సు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.సురేష్
ఈరోజు అత్యవసర సమయంలో రక్త  దానం చేసి మానవత్వాన్ని ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్  
రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని తీర్చాలనేదే  ముఖ్యమంత్రి తపన