భూ కబ్జాకోరులకు కొమ్ము కాస్తున్న కార్పొరేషన్ అవినీతితో అన్యాక్రాంతం చేసిన భూమి
భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న బిల్డర్స్
నమస్తే భారత్: హనుమకొండ : భూమి కాపాడాలని, భూమిలో ఇంటి నిర్మాణ అనుమతుల ఇవ్వరాదని గత మూడు సంవత్సరాలుగా వరంగల్ మహానగర కార్పొరేషన్ కు పలుమార్లు విన్నవించుకున్న సాయిని నరసింహయ్య. భూమిని కబ్జా చేయడానికి యత్నిస్తున్న నైసోన్, జెర్షోన్, బిల్డర్లు వేణుగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వరంగల్ మున్సిపల్ కమీషనర్, డిప్యూటీ కమీషనర్, హన్మకొండ జిల్లా కలెక్టర్, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ లపై హై కోర్టులో రిట్ దాఖలు చేశారు. మున్సిపల్ అధికారులు, గత ప్రభుత్వ పాలకుల అవినీతి ముందు అన్ని పిర్యాదులు బుట్ట దాఖలు.
- హై కోర్టును లెక్కచేయని వైనం
- భూమి రక్షణ కొరకు పెట్టిన గోడను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు
భూమిని కాపాడుకోవడానికి ఆమరణ నిరహార దీక్షనే శరణ్యం అంటున్న సాయిని నరేందర్..
ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు, మీడియా ప్రగతిశీలవాదులు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ మండలం వడ్డేపల్లి శివారులోని జవాహార్ కాలనీలోని సర్వే నంబర్ 27 లో 2010 లో నేను సాయిని నరేందర్, సాయిని నరసింహాయ్య కుటుంబ సభ్యులు, స్నేహితులం కలిసి 2310 చదరపు గజాల ఇంటి స్థలం కొనుగోలు చేసినారు. అప్పటి నుండి అట్టి స్థలం వారి స్వాధీనంలోనే ఉంది. వీరి భూమికి దక్షిణాన తాల్లపెల్లి నోవా (రిటైర్డ్ ఎం ఆర్ ఓ) కు గల ఇంటి స్థలం నోవా పాలి వారితో కోర్టులో దావా నడుస్తుంది. అట్టి దావా 15 ఏండ్లుగా కోర్టులో నడిచి గత నెలలో తుది తీర్పు వచ్చింది. నోవా కోర్టు తీర్పు వచ్చే వరకు వారి భూమి మొత్తం భూ కబ్జాదారులచే అన్యాక్రాంతమైనది. నోవా ప్రక్కన ఉన్న భూమితో పాటు నరేందర్ భూమిని కూడా కబ్జా చేసినారు. ఇట్టి కబ్జాపై వరంగల్ మహానగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు, హన్మకొండ జిల్లా కలెక్టర్ కు 2022 నుండి 2025 వరకు సాయిని నరసింహయ్య పలుమార్లు పిర్యాదు చేసినాము. అధికారులు స్పందించకపోవడంతో భూ కబ్జాకోరుల నుండి వారి భూమి రక్షణ కోసం 2023 లో హై కోర్టును ఆశ్రయించడమైంది. ఆ హై కోర్టు రిట్ పిటిషన్ కు భూ కబ్జాకోరులు వేణుగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి లు కౌంటర్ కూడా దాఖలు చేసినారు. నేటికీ అట్టి రిట్ పిటిషన్ తెలంగాణ హై కోర్టులో పెండింగ్ లో ఉంది. బాధితులు పిర్యాదులు చేసిన ప్రతిసారి కమీషనర్ సహా ఆయా విభాగాల అధికారులు బదీలపై కొత్తగా వచ్చామని, మేము పరిశీలిస్తామని దాటవేస్తూ వచ్చినారు. ఎంతమంది కమీషనర్లు మారినా బాధితుల సమస్య జటిలమవుతుంది కానీ పరిష్కారమవడం లేదు. వారి భూమిలో ఎలాంటి ఇంటి నిర్మాణాల అనుమతులు ఇవ్వరాదని మొదట రెండు అనుమతులు ఇచ్చినప్పుడు వరంగల్ మున్సిపల్ కమీషనర్ కు వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేదు. వినతి పత్రం ఇచ్చిన తర్వాత కూడా మరో ఏడు (7) ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చినారు. వీరు అభ్యంతరం తెలియజేస్తున్నా కూడా ఇంటి పత్రాలను పరిశీలంచకుండా మీరు ఇంటి నిర్మాణ అనుమతి పత్రాలు ఎందుకు ఇస్తున్నారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించినా ఫలితం లేదు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే ఎవరికైనా ఇంటి నిర్మాణ అనుమతులు ఇస్తామని మున్సిపల్ అధికారులు తెగబడిన సమాధానం ఇస్తున్నారు. ఈ విధంగా వారి స్థలాన్ని కబ్జా చేసి కొంతమేరకు ఇళ్ల నిర్మాణం చేయడమే కాకుండా వారి భూమిని రోడ్డు క్రింద చూపుతున్నారని, వారి భూమిలో రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా అట్టి రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేయాలని మార్చి 10 న మున్సిపల్ కమీషనర్ కు పిర్యాదు చేసినారు. వారు పిర్యాదు చేసిన తర్వాత కూడా భూమిలో అక్రమంగా సి సి రోడ్డు నిర్మాణం చేసినారు. వారి భూమిని రక్షించుకోవడానికి వేరే మార్గం లేక వారి భూమికి అడ్డంగా ప్రహారీ గోడ నిర్మించుకున్నారు. ప్రహారీ గోడ నిర్మాణం జరుగుతున్న సేపు భూ కబ్జాదారుల గ్యాంగ్ ఎన్నో బెదిరింపులు చేసారు. పోలీసులకు పిర్యాదు చేసి బెదిరించినారు. మున్సిపల్ అధికారులచే బెదిరింపులకు పాల్పడినారు. వారి భూమి రక్షణ కోసం పెట్టిన గోడను వరంగల్ మహానగర మున్సిపల్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా బుధవారం ఉదయం కూల్చివేసినారు. గత మూడు సంవత్సరాలుగా వారి భూమి రక్షణ కోసం, అక్రమ ఇంటి అనుమతులు రద్దు చేయాలని ఎన్ని సార్లు పిర్యాదులు చేసినా స్పందించని వరంగల్ మహానగర మున్సిపల్ అధికారులు వారి భూమి రక్షణ కోసం గోడ నిర్మాణం చేసిన 24 గంటలలోనే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దుర్మార్గంగా కూల్చివేసినారు. మున్సిపల్ అధికారులు ఒక వర్గం ఫిర్యాదులపై మౌనం తీరు, ఒక వర్గం ఫిర్యాదులపై స్పందన తీరు చూస్తుంటే వీరు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు అవగతమవుతుంది. వరంగల్ మహానగరంలో ఎన్నో అనుమతిలేని ఇండ్లు, బిల్డింగ్ లు ఉన్నాయి. అట్టి ఇళ్లకు ఇంటి నెంబర్లు ఇచ్చి ఇంటి పన్ను కూడా వసూలు చేస్తున్న అధికారులు భూమి రక్షణ కోసం మూడు ఫీట్ల ఎత్తు నిర్మించిన గోడను మాత్రం నిర్మాణ అనుమతి లేదని వెంటనే కూల్చివేసిననారు. భూ కబ్జాకోరుల నుండి, అవినీతి అధికారుల నుండి మా భూమిని రక్షించుకునే మార్గం కానరావడం లేదని మా భూమిని ఆక్రమించిన భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టి, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకొని మా భూమిని రక్షించుకోవడానికి మాకు ఆమరణ నిరాహార దీక్ష తప్ప వేరే మార్గం కనపడడం లేదని సాయిని నరేందర్, నర్సింహయ్య లు తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కె సి ఆర్ కన్నా ముందు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణా రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన నేను నేడు నా భామిని భూ బకాసురుల నుండి రక్షించుకోవడానికి వరంగల్ మహానగర మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. మా న్యాయ పోరాటానికి ప్రజా సంఘాల వారు, సామాజిక ఉద్యమకారులు, ప్రగతిశీలవాదులు, న్యాయవాదులు అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

