తొర్రూరు లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వంద పడకల ఆసుపత్రి తొర్రూరు కేంద్రాల్లోనే నిర్మించాలి

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం వామపక్ష పార్టీల నాయకులు అందజేశారు

తొర్రూరు లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వంద పడకల ఆసుపత్రి తొర్రూరు కేంద్రాల్లోనే నిర్మించాలి

నమస్తే భారత్ :-తొర్రూరు : తొర్రూరు ప్రజలకు అందుబాటులో వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని, వామపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు  తొర్రూర్ ప్రాంత సమస్యల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రాంత సమస్యలన్నీటిని పరిష్కరించాలని కోరుతూ, పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది.. తొర్రూరు ప్రాంత సమస్యల పై  వామపక్ష పార్టీల నాయకులు  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూన్నా సిపిఐ రాష్ట్ర నాయకులు తమ్మెర విశ్వేశ్వరరావు, సిపిఎం జిల్లా నాయకులు బొల్లం అశోక్, మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ముంజపల్లి వీరన్న, న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగయ్య లు మాట్లాడుతూ, తొర్రూరులో మంజూరైన 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని, ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పట్టణ కేంద్రంలో నిర్మించాలని, తొర్రూరు పట్టణంలో ప్రైవేటు భూమిని కొనటానికి నిధుల కొరత ఉంటే వామపక్ష పార్టీలు జోల పట్టుకుని నిధులు వసూలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. తొర్రూరు ప్రధాన రహదారిపై డ్రైనేజీని నిర్మాణాన్ని పూర్తి చేస్తూ కరెంటు పోల్స్ తొలగించాలని రోడ్డు నుండి డ్రైనేజీ వరకు సిసి రోడ్డు నిర్మించాలని అన్నారు. మినీ ట్యాంక్ బండ్ పనులు జరగకపోవటం తో వాటి నిర్మాణానికి వచ్చిన నిధులు మురిగిపోతున్న, ప్రభుత్వం స్పందించకపోవడం సరి కాదన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టి ఇల్లు లేని వారికి నివాసాన్ని కల్పించాలని అన్నారు. డివిజన్ కేంద్రమైన తోరూరులో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా ఎస్ టి ఓ, ఫైర్ స్టేషన్,ఇరిగేషన్ ఆఫీస్ తో పాటు మినీ స్టేడియం, బాలికల హై స్కూల్, పాలిటెక్నిక్ కాలేజ్ లు తదితర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని యుద్ద ప్రాతిపదికన నిర్మాణాన్ని చేపట్టాలని వారు  డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు రైతులకు అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని అన్నారు. ఆర్డీవోకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన ఆర్డీవో  మీ డిమాండ్ల ను జిల్లా కలెక్టర్ కు పంపిస్తారని హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం తొర్రూర్ మండల కార్యదర్శి ఎండీ యాకుబ్, సిపిఐ తొర్రూర్ మండల బందు మహేందర్

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కేతకి ఆలయ పాలక మండలి నియామకం.. ప్రమాణ స్వీకారానికి మంత్రులు, ఎంపీ కేతకి ఆలయ పాలక మండలి నియామకం.. ప్రమాణ స్వీకారానికి మంత్రులు, ఎంపీ
ఝరాసంగం, ఏప్రిల్ 4 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలిని నియమిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది....
మధ్యప్రదేశ్‌లో విషాదం.. బావిలో విషవాయువు పీల్చి ఎనిమిది మంది మృతి
బంగ్లాదేశ్ నేత యూనుస్‌తో ప్ర‌ధాని మోదీ భేటీ
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి.. హుజూర్‌నగర్‌ కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు
మ‌రుగుజ్జుగా రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌చారంలో నిజమెంత‌?
ట్రంప్‌ టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. మరింత పెరగనున్న ఐఫోన్‌ ధరలు..?
వనమేధం లోగుట్టు.. గ్రోక్‌ రట్టు