సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు చేయరాదు: జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపియస్
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : నారాయణపేట జిల్లా పరిధిలో సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం మరియు ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ. రాజకీయంగాను, కుల, మత, ప్రాంతీయంగాను ప్రజల భద్రతకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్న వాటిని సామాజిక మాద్యమాలలో షేర్ చేసిన చట్టప్రకారం తీవ్రమైన చర్యలు ఉంటాయని తెలిపారు. సామాజిక మాధ్యమాలుఅయిన ఫేస్బుక్ , ట్విట్టరు ఇంస్టాగ్రామ్, వాట్సప్ గ్రూపులలో ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా, ఒక వర్గానికి కించపరిచే విధంగా ఉన్న, తమకు తెలియని వీడియోలు, ఫోటోలు పోస్టులు చేసిన, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసిన ఆ గ్రూపు అడ్మిన్ నీ బాధ్యుడిగా చేస్తూ, ఫార్వర్డ్ చేసిన వారిపైన కేసులు నమోదు చేయబడుతాయి అని తెలిపారు. సామాజిక మధ్యమాలను మంచి పనులకు తప్ప వేరే రకంగా వినియోగించే వాళ్లపైన ప్రత్యేకంగ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.జిల్లాలో ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడే వారిని అనుక్షణం పోలీసులు గమనిస్తూ ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది కావున ఈ తరహా నేరలకుఇ పాల్పడే వారిని వెంటనే పట్టుకొని అట్టి వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. పోలీసులు నిరంతరం 24/7 పరిశీలిస్తుంటారని తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు చేసిన, ఫార్వర్డ్ చేసిన జాగ్రత్తగా గమనించి చేయాలని ఎస్పీ సూచించారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
