ఆకాశవాణిలో 37వ వార్షికోత్సవ వేడుకలు

* శ్రోతలను సన్మానించిన ఆకాశవాణి అధికారులు

ఆకాశవాణిలో 37వ వార్షికోత్సవ వేడుకలు

నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం  బ్యూరో: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఆవిర్భవించి 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు రేడియో స్టేషన్ ఆవరణలో  ఘనంగా నిర్వహించారు. స్టేషన్ ప్రోగ్రాం హెడ్ బైరి శ్రీనివాసన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో "శ్రోతలతో ఆత్మీయ సమ్మేళనం" ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలైన  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రేడియో వింటున్న శ్రోతలు కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గత 36 సంవత్సరాలుగా ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం  వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించి  శ్రోతలను అలరిస్తున్న తీరును ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆకాశవాణి ఏర్పాటు నుండి  రేడియో కార్యక్రమాలు వింటున్న శ్రోతలు వారి వారి అభిప్రాయాలు అనుభూతులను వేదిక మీద పంచుకున్నారు. అనంతరం  ఆత్మీయ సమ్మేళనానికి  విచ్చేసిన శ్రోతలను  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ అధికారి  కొలిపాక శంకరరావు,  ఇంజనీర్ బాబు సింగ్, బొల్లవరపు ప్రసాద్, స్వామి, సిబ్బంది, రేడియో జాకీలు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags: