అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన 3 టౌన్ పోలీసులు
సిద్ధిపేట నమస్తే భారత్ : నేరస్థుని వివరాలు
పేరు గుర్రం అఖిల్ @ తాడిశెట్టి మణికంఠ తం. శ్రీను, వ. 32 సం.లు, కులం: చిన్నకాపు, వృ: హోటల్ పని, ని: మసీద్ రోడ్డు, శాలిపేట, తాడేపల్లిగూడెం, జిల్లా: పశ్చిమగోదావరి, ఆంధ్రప్రదేశ్
త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ కేసు వివరాలు తెలియపరుస్తూ
పొన్నాల “Y” జంక్షన్ వద్ద ఉన్న గౌరి శంకర్ తరుణి వైన్స్ సిబ్బంది రోజు మాదిరిగా తేది: 29.03.2025 నాడు రాత్రి 10.00 గంటలకు వైన్స్ మూసి వెళ్ళినారు. తిరిగి తేది: 30.03.2025 నాడు ఉదయం 10.00 గంటలకు వచ్చేసరికి గుర్తుతెలియని దొంగ వైన్ షాప్ యొక్క పై కప్పు రేకులను విప్పి వైన్ షాపులోకి ప్రవేశించి రూ. 30,000/- నగదు, 2 మెన్షన్ హౌస్ ఫుల్ బాటిల్స్ దొంగిలించినారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రాంభించనైనది.
సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిద్దిపేట త్రీ టౌన్ సిబ్బంది చంద్రయ్య, కానిస్టేబుళ్లు బాబు, శ్రీనివాస్ మరియు సెంట్రల్ క్రైం స్టేషన్ సిద్దిపేట ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు సిబ్బంది యాదగిరి, ప్రవీణ్, శివ, నగేష్ తో కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుని ఆచూకీ గురించి వెతుకూచుండగా నిన్నటి రోజు తేదీ: 31.03.2025 నాడు సాయంత్రం 4.00 గంటలకు నిందితుడు పొన్నాల వై జంక్షన్ వద్ద హైదరాబాద్ వెళ్లడానికి అనుమానాస్పదంగా తిరుగుతుండగా వెళ్లి పట్టుకుని విచారించగా వైన్ షాప్ లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు
పై నేరస్తుని వద్ద నుండి వద్ద నుండి నగదు రూ. 30,000/-మద్యం సీసా, రేకులు ఇప్పడానికి గాను ఉపయోగించిన పానలు (రించ్), తాడును స్వాధీన పరుచుకొని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగింది.పై నేరస్తుడు గతంలో దొంగతనం చేసిన వాటి వివరాలు
పై నేరస్తుడు చెడు వ్యసనాలకు బానిసై కూలీపనులకు సరిగా వెళ్ళక డబ్బుల కోసం 2012 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హుండీ పోలీస్ స్టేషన్ పరిదిలో దొంగతనం కేసులో జైలుకు వెళ్ళినాడు. తర్వాత 2021 లో తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ పరిదిలో దొంగతనం చేయగా రాజమండ్రి సెంట్రల్ జైల్ కు వెళ్ళినాడు. జైల్ నుండి విడుదల అయిన తర్వాత డబ్బుల కోసం 2025 జనవరి నెలలో తాడేపల్లిగూడెం నుండి ట్రైన్ లో సికింద్రాబాద్ వచ్చి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిదిలో పెయింట్ షాప్ నందు ఒక ల్యాప్ టాప్, ఒక మొబైల్ ఫోన్, కొంత నగదు దొంగతనం చేసి అట్టి వస్తువులను అమ్ముకోని వచ్చిన డబ్బులతో తిరిగి వెళ్ళినాడు. మళ్ళీ డబ్బుల కోసం తేది: 23.03.2025 నాడు తాడేపల్లిగూడెం సికింద్రాబాద్ వచ్చి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హార్డ్ వేర్ షాప్ యొక్క రేకులను పానలతో విప్పి షాప్ నందు ఒక Samsung మొబైల్ ట్యాబ్, టేబుల్ డ్రాలో ఉన్న కొంత నగదు దొంగిలించి Samsung మొబైల్ ట్యాబ్ ను సికింద్రాబాద్ నందు గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మగా వచ్చిన డబ్బులు మరియు దొంగిలించిన డబ్బులను తన జల్సాలకు ఖర్చు చేసి ఎంజాయ్ చేసినాడు. మళ్ళీ తన చేతిలో డబ్బులు లేకపోవడంతో తేది: 29.03.2025 నాడు సికింద్రాబాద్ నుండి సిద్దిపేటకు వచ్చి వైన్ షాప్ ను గమనించి రాత్రి సమయమున వైన్ షాప్ పైకి ఎక్కి రేకులను విప్పి తాడు సహాయంతో షాప్ లోకి ప్రవేశించి దొంగతనం చేసినాడు.
ఈ సంధర్బంగా త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో షాపుల వారు మరియు గృహాల యజమానులు సి.సి కెమెరాలను తప్పని సరిగా ఏర్పాటు చేసుకోగలరు. నేరస్థున్ని పట్టుకోవడంలో, వ్యక్తి గత భద్రత విషయంలో సెన్సాఫ్ సెక్యూరిటీకి సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని తెలిపారు. గ్రామాలలో సిద్దిపేట పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
