క్రికెట్ బెట్టింగ్స్ పై  ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయాలి         

క్రికెట్ బెట్టింగ్స్ పై  ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయాలి         

   సిద్ధిపేట  నమస్తే భారత్  : కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మేడమ్ గారు,  సిద్దిపేట ఏసిపి మరియు  సిద్దిపేట వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, ఇన్స్పెక్టర్లతో  కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించి (2023, 2024, 2025 అండర్ఇ న్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి ఏసిపి. సీఐలను,అడిగి తెలుసుకున్నారు* ఫోక్సో, ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజులలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఉక్కు పాదంతో అణిచివేయాలి ఈ సందర్భంగా కమిషనర్ మేడమ్ గారు మాట్లాడుతూ* ఫోక్సో ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజులలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి, క్రికెట్ బెట్టింగ్స్ పై  ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయాలి, గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఉక్కు పాదంతో అణిచివేయాలి. నూతన టెక్నాలజీని అధికారులు సిబ్బంది అందిపుచ్చుకోవాలి  ఏరోజుకు కారోజు అప్డేట్ కావాలి,  కేసు నమోదైన వెంటనే నిందితులను అరెస్టు చేయాలి, నిందితులను అరెస్టు చేసే విషయంలో ఎలాంటి జాప్యం ఉండకూడదు, ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యను పరిష్కరించాలి. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలి, లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలి, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సీసీటీఎంఎస్ డాటా ప్రతిరోజు మానిటర్ చేయాలి,  నేను సైతం సీసీ కెమెరాలను  జియో టాకింగ్ చేయాలి,  2023,  2024  సంవత్సరంలో పెండింగ్ ఉన్న కేసులలో అన్ని కోణాలుల్లో పరిశోధన చేసి కేసులు ఫైనల్ చేయాలని సూచించారు. దొంగతనాల నివారణ గురించి ప్రత్యేక చర్యలు చేపట్టాలి  రాత్రి సమయాలలో బ్లూ కోల్డ్స్, పెట్రో కార్ అధికారులు సిబ్బంది నిరంతరంగా విధులు నిర్వహించాలి. డయల్ 100 కాల్ రావాలి వెంటనే రెస్పాండ్ అయి స్వార్థమైనంత త్వరగా సంఘటన స్థలానికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. డయల్ 100 కాల్స్ పై అలసత్వం వహించవద్దు. నాన్ బేలబుల్ వారెంట్ (NBWs) సాధ్యమైనంత త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలని సూచించారు. CEIR పోర్టల్ లో ఫోన్లు పోయినట్టు నమోదైన ఫిర్యాదులలో వెంటనే ఫోన్లు రికవరీ చేయాలని సూచించారు. పెండింగ్ ఉన్న దరఖాస్తులను  విచారణ చేసి త్వరగా డిస్పోజల్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సిద్దిపేట ఏసీపీ మధు, ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్ గౌడ్, ఏఓ యాదమ్మ, సూపరిండెంట్ ఫయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags: