రంజాన్, ఉగాది పండుగల సందర్బంగా షాద్ నగర్ పోలీస్ శాఖ అధ్యర్యంలో శాంతి సమావేశం ఏర్పాటు
ముఖ్య అతిధులుగా ఏసీపీ రంగస్వామి, మున్సిపల్ కమీషనర్ సునీతా రెడ్డి
నమస్తే భారత్,షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లోని బుగ్గారెడ్డి గార్డెన్ లో షాద్ నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ అధ్యర్యంలో రంజాన్, ఉగాది పండుగలను పురస్కరించుకొని శాంతి సమావేశంఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఏసీపీ రంగస్వామి, మున్సిపల్ కమీషనర్ సునీత రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా శాంతి సమావేశం కు విచ్చేసిన హిందూ, ముస్లిం మతపెద్దలు, నాయకులు, యువకులు పాల్గొని హిందూ ముస్లిం ఐక్యత గురించి ప్రస్థావించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ షాద్ నగర్ ఇప్పటివరకు ఎలాంటి మతపరమైన సంఘటనలు జరుగలేదని ఇక్కడ అందరు శాంతి, ప్రేమ, ఐక్యత తో ఉంటారని తెలిపారు. అందరు పండుగలను శాంతియుతంగా, ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని అన్నారు. ఇక్కడ హిందూ ముస్లిం లు గంగా జమున తహజీబ్ ల కలిసి మెలిసి ఉంటారని తెలిపారు.నేటి సమాజం లో మనుషులకు కావలిసింది మంచి (ప్రవర్తన) కావాలని దాని వల్ల ఎలాంటి సంఘటనలు జరుగవని అన్నారు. ఈ సందర్బంగా ఏసీపీ మరియు మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ ముందుగా హిందూ, ముస్లిం సోదరులకు రంజాన్, ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలకు పోలీస్ శాఖ మరియు మున్సిపల్ శాఖ సహకారం ఎప్పుడు ఉంటుందని, ప్రతి ఏరియాలో పోలీస్ బందోబస్త్ నిర్వహిస్తామని అలాగే దేవాలయాలు, మస్జీద్ ల వద్ద లైట్లు, పరిశుభ్రత గురించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ శాంతి సమావేశం లో బీజేపీ నాయకులు అందె బాబయ్య, బెంది మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్,రబ్ జామి, ప్రశాంత్, సయ్యద్ మాసూద్ ఖాజీ, ఆశ్రఫ్ హుస్సేన్, జమృద్ ఖాన్, సర్వర్ పాషా, ముబీన్ గోరి,అసద్ అలీ,వీర్లపల్లి అన్వార్,మాజీ సర్పంచ్ సలీం, పెంటనోళ్ల నర్సింహా, బిలాల్, జఫర్, ఆమెర్, అజ్జు,మున్నా, యూనుస్, మహబూబ్, అలీమ్ సఖిబ్,తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

