అగ్ని వీర్ ఎంపికకు ఉచిత స్టడీ తరగతులు ప్రారంభం అకాడమీ డైరెక్టర్ అంజనేయులు
నమస్తే భారత్ / నారాయణపేట జిల్లా : వారియర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అగ్ని వీర్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగ యువతకు ఉచితంగా స్టడీ తరగతులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది నిరుద్యోగ యువత వారియర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ తరగతుల ద్వారా అలాగే ఉచిత ఫిజికల్ ఫిట్నెస్ శిక్షణ ద్వారా రక్షణ సంబంధిత ఉద్యోగాల్లో రాణించారు. తాజాగా వెలువడిన అగ్ని నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని ఉచిత స్టడీ తరగతులను అశోక్ నగర్ లోని లయన్స్ క్లబ్ భవన్ లో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ అంజనేయులు ఆర్మీ మాట్లాడుతూ ఉచిత శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని... పూర్తి వివరాలకు 90862 71418 సంప్రదించాలని కోరారు. వెనకబడిన నారాయణపేట జిల్లాలో నిరుద్యోగ యువతను రక్షణ రంగంలో రాణించాలని తమ లక్ష్యమని తెలిపారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

